NTV Telugu Site icon

Starlink satellites: భూమి చుట్టూ 30,000 శాటిలైట్స్.. ఎలాన్ మస్క్ బిగ్ ప్లాన్..

Starlink Satellites

Starlink Satellites

Starlink satellites: స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ భారీ ప్రణాళికకు సిద్ధమయ్యాడు. తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవల్ని మరింత పెంచేందుకు పెద్ద ప్లాన్ వేశాడు. తన సెకండ్ జనరేషన్ స్టార్‌లింక్ వ్యవస్థ కోసం 29,988 శాటిలైట్లను భూమి చుట్టూ మోహరించాలని అనుకుంటున్నాడు. తన స్టార్‌లింక్ శాటిలైట్ నెట్‌వర్క్‌ని విస్తరించడానికి ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్(ఎఫ్‌సీసీ)కి ప్రతిపాదనలు దాఖలు చేశాడు.

ప్రస్తుతం 7000 వరకు చిన్నవైన స్టార్‌లింక్ శాటిలైట్స్ అంతరిక్షంలో భూమి చుట్టూ తిరుగుతున్నాయి. తాజా ప్రణాళిక ప్రకారం.. స్పేస్ఎక్స్ తన నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరచడానికి అదనపు స్పెక్ట్రమ్‌ని ఉపయోగించడానికి, తక్కువ ఎత్తులో శాటిలైన్లను కక్ష్యలో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ ఎక్స్ E-బ్యాండ్ ఫ్రీక్వెన్సీలను ప్రభావితం చేయాలని అనుకుంటోంది

Read Also: Dragon Fruit Benefits: డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలా..? ముఖ్యంగా దానికి

శాటిలైట్స్ ఎత్తుని “525 km, 530 km, 535 km నుండి వరుసగా 480 km, 485 km , 475 km ఎత్తు”కి తగ్గించాలనుకుంటోంది. దీని ద్వారా స్టార్‌లింక్ ఇంటర్నెట్ స్పీడ్‌‌లో జాప్యాన్ని 20 మిల్లీసెకన్ల కంటే తక్కువకి తగ్గించడం, శాటిలైట్ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం వంటి లక్ష్యాలను పెట్టుకుంది. ఒకవేళ ఎఫ్‌సీసీ ఆమోదించినట్లైతే ఈ శాటిలైట్ కాన్‌స్టలేషన్ ప్రపంచ ఇంటర్నెట్ కవరేజ్‌ని సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. తదుపరి శాటిలైట్లను స్టార్‌షిప్ మాత్రమే ప్రయోగించేంత పెద్దవిగా ఉంటాయి. కొత్త ప్రతిపాదనలో శాటిలైట్ల ఎత్తు తగ్గడంతో బ్యాండ్ విడ్త్‌ని 10 రెట్లు పెంచుతుందని, గిగా బిట్ స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుందని మస్క్ సోమవారం చెప్పారు.

ప్రస్తుతం స్టార్‌లింక్ యూజర్లు సాధారణంగా 25 నుంచి 220 Mbps మధ్య డౌన్‌లోడ్ వేగాన్ని, ఎక్కువ మంది100 Mbps కంటే ఎక్కువ వేగాన్ని పొందుతున్నారు. అప్‌లోడ్ వేగం సాధారణంగా 5 మరియు 20 Mbps మధ్య ఉంటుంది.