Site icon NTV Telugu

Elon Musk: 14 మంది కాదు అంతకు మించి, జపనీస్ పాప్ స్టార్‌తో మరో బిడ్డను కన్న ఎలాన్ మస్క్..

Elon Musk

Elon Musk

Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత మరో బిడ్డకు తండ్రి అయినట్లు తెలుస్తోంది.ఎలాన్ మస్క్ ఒక జపనీస్ పాప్ స్టార్‌తో బిడ్డను కన్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఎలాన్ మస్క్‌తో రోములస్ అనే కొడుకును కన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆష్లే సెయింట్ క్లైర్‌(26) ఈ ఆరోపణలు చేసినట్లు ది న్యూయార్క్ టైమ్స్(NYT) మరో కొత్త కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. జపనీస్ పాప్ స్టార్ తో సహా ప్రపంచవ్యాప్తంగా పలువురు పిల్లలకు తాను తండ్రినని మస్క్ చెప్పినట్లు ఆమె వెల్లడించిందని NYT తెలిపింది. అడిగిన వారికి తన వీర్యాన్ని ఇస్తానని మస్క్ తనతో అన్నాడని ఆమె చెప్పింది. ఇదే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గడంపై మస్క్ తీవ్ర ఆందోళన చెందుతున్నారని, తన వీర్యకణాలు అడిగిన వారికి ఇచ్చానని, అయితే, ఆ పాప్ స్టార్ పేరు మాత్రం చెప్పలేదని ఆమె తెలిపింది.

‘ఇది కేవలం పరోపకారం మాత్రమే అని అతను అనిపించేలా చేశాడు. ఈ వ్యక్తులు పిల్లల్ని కనాలని అతను సాధారణంగా నమ్మాడు’ అని సెయింట్ క్లైర్ చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఇప్పటికే ఎలాన్ మస్క్‌ నలుగురు మహిళ ద్వారా 14 మంది సంతానం ఉన్నారు. వీరిలో కెనెడియన్ మ్యూజిషియన్ గ్రిమ్స్, మస్క్‌కి చెందిన న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్ ఉన్నారు. సెయింట్ క్లైర్‌తో సంబంధం వల్ల మస్క్‌కి 13వ బిడ్డ కలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో అతని మొదటి భార్య జస్టిన్ విల్సన్‌తో ఐదుగురు, గాయని గ్రిమ్స్‌తో ముగ్గురు, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ శివోన్ జిలిస్‌తో ముగ్గురు, ఇప్పుడు రోములస్ ఉన్నారు.

Read Also: Perni Nani: అందుకే వంశీని 115 రోజులుగా జైల్లో ఉంచారు.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..

అయితే, మస్క్ వాస్తవ పిల్లల సంఖ్య అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉంటుందని నివేదిక సూచించింది. నివేదిక ప్రకారం, జపాన్ అధికారులు తనను ఒక ఉన్నత స్థాయి మహిళకు స్పెర్మ్ డోనర్‌గా ఉండమని అడిగారని బిలియనీర్ పేర్కొన్నారు. ‘‘వారు నన్ను స్పెర్మ్ డోనర్‌గా ఉండాలని కోరుకున్నారు. ఇందులో ప్రేమ, మరేది లేదు, కేవలం స్పెర్మ్ మాత్రమే’’ అని మస్క్ చెప్పినట్లు నివేదిక వెల్లడించింది.

సెయింట్ క్లైర్‌తో గతేడాది సెప్టెంబర్‌లో మస్క్ మరో బిడ్డకు తండ్రి అయినట్లు తెలుస్తోంది. అయితే , దీనిని దాచాలని మస్క్ అనుకున్నాడని, అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత మార్-ఎ-లాగో పార్టీలో మస్క్ తనకు తెలియదని నటించాల్సి వచ్చిందని క్లై్ర్ చెప్పింది. ఇదే కాకుండా, న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా బిలియనీర్ డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సామర్థ్య శాఖ (DOGE)తో తన పని సమయంలో “తీవ్రంగా” మరియు క్రమం తప్పకుండా మాదకద్రవ్యాలను ఉపయోగిస్తున్నారని, ఇందులో “చాలా కెటామైన్ అతని మూత్రాశయాన్ని ప్రభావితం చేస్తుందని” ఆరోపించింది.

Exit mobile version