Site icon NTV Telugu

Elon Musk: పేరు మార్చుకున్న మస్క్.. ఎక్స్ ప్రొఫైల్ పిక్ కూడా ఛేంజ్! అర్థమేంటంటే..!

Elon Musk

Elon Musk

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ కొత్త ఏడాదికి ముందు సరికొత్త నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. మస్క్.. ఓ వైపు వ్యాపారాలు.. ఇంకోవైపు రాజకీయ వ్యవహారాలతో బిజిబిజీగా గడుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్‌తో ఎక్కువగా గడిపే మస్క్.. అమెరికా పాలనా అంశాలపై చర్చిస్తుంటారు. తాజాగా ఆయన తన పేరును.. అలాగే ఎక్స్ ప్రొఫైల్ పిక్ మార్చుకుని నెటిజన్లను ఆలోచనలో పడేశారు. ఆయన కొత్త పేరు అర్థమేంటి? ప్రొఫైల్‌లో ఉన్న ఫొటో ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: Hamas Attack On Israel: ఇజ్రాయిల్‌పై దాడికి 7 ఏళ్ల నుంచే నిఘా పెట్టిన హమాస్..

ఎలాన్‌ మస్క్‌… తన పేరును ‘కేకియస్‌ మాక్సిమస్‌’గా మార్చుకున్నారు. అంతేకాకుండా ఎక్స్ ఖాతా ప్రొఫైల్ పిక్‌ను ‘పెపే ది ఫ్రాగ్’ ఫొటో పెట్టుకున్నారు. ఇక పెపే ది ఫ్రాగ్ చేతిలో జాయ్‌స్టిక్‌తో వీడియో గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే మస్క్.. కొత్త పేరుపై నెటిజన్లు అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు. కేకియస్‌ అనేది ఒక క్రిప్టో కరెన్సీ టోకెన్‌. మస్క్ ఎప్పుడూ క్రిప్టో కరెన్సీకి మద్దతు ఇస్తుంటారు. ఇక మాక్సిమస్ అంటే సాధారణంగా ఉపయోగించే జ్ఞానోదయం లేదా అత్యుత్తమ విజయాలకు ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా రోమన్ కుటుంబాల్లో ఒక విశిష్ట వంశం అని కూడా తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు..

Exit mobile version