Egypt Oil Tanker Explosion: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో 31 మంది మృతి, 21 మందికి పైగా గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Egypt Oil Tanker Explosion: ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రింగ్ రోడ్డుపై ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడటంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ట్యాంకర్లో పేలుడు తర్వాత మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో కనీసం 31 మంది ప్రాణాలు కోల్పోగా, 21 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. వేగంగా వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి హైవేపై బోల్తా పడినట్లు తెలుస్తోంది. అనంతరం ట్యాంకర్లో పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. సమీపంలో ఉన్న కార్లు, బైకులు సహా పలు వాహనాలు మంటల బారిన పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు డజన్లకు పైగా వాహనాలు కాలిపోయినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. జాయెద్ స్పెషలైజ్డ్, ఇంబాబా జనరల్, వర్రాక్ సెంట్రల్ ఆసుపత్రుల్లో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యల కోసం 39 అంబులెన్సులను రంగంలోకి దించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Jennifer Barreto: 116 అందగత్తెలతో పోటీ.. Miss Universe 2026 విజేతగా 'జెన్నిఫర్ బారెటో'..!
- US Tariffs on India: భారత్‌కు ట్రంప్ మరో షాక్.. భారతీయ వస్తువులపై అమెరికా భారీ టారిఫ్‌లకు సిద్ధం!
- Shenzhou-24 Mission: చరిత్ర సృష్టించిన చైనా.. తియాంగాంగ్ స్టేషన్‌కు షెన్‌జౌ-24.. తొలి విదేశీ వ్యోమగామిగా పాకిస్థానీ!
- Bangladesh Measles Outbreak: బంగ్లాదేశ్‌లో మీజిల్స్ కలకలం.. 1,361 మంది మృతి.. భారత్‌కు కూడా ముప్పు ఉందా?
ఈ ఘోర ప్రమాదం కైరోలోని ఇంబాబా శివారు ప్రాంతమైన వర్రాక్ వద్ద చోటుచేసుకుంది. ఈజిప్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గిజా ప్రాంతంలోని అల్-వర్రాక్ జిల్లాలో ఓ సొరంగం పైన ఈ అగ్నిప్రమాదం సంభవించింది. కైరో రింగ్ రోడ్డు గ్రేటర్ కైరోలోని ప్రధాన రహదారులను అనుసంధానిస్తుంది. కైరో, గిజా, కల్యూబియా ప్రావిన్సులను కలిపే ఈ హైవే అత్యంత కీలకమైన రవాణా మార్గంగా ఉంది. ట్యాంకర్ ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డుపై ఉన్న వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. రాత్రి వేళ ఆకాశాన్ని తాకేలా భారీగా మంటలు ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఈ ఘోర ప్రమాదంపై ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్-సీసీ స్పందించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తూ, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో వందలాది మంది ప్రజలు గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బంది, వైద్య బృందాలు సహాయక చర్యలను కొనసాగించాయి. ఇటీవల యూఏఈలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బస్సు, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Egypt Oil Tanker Explosion: ఘోర ప్రమాదం.. ఆయిల్ ట్యాంకర్ పేలుడుతో 31 మంది మృతి, 21 మందికి పైగా గాయాలు
-
US Tariff Threat: భారత్‌పై అమెరికా 25% సుంకాల ప్రతిపాదన.. అధిక ఉత్పత్తి సామర్థ్యం ఆరోపణలను ఖండించిన కేంద్రం
-
AP Local Body Elections Live Updates : ఏపీలో ఎన్నికల సందడి.. పల్లెలు, పట్టణాల్లో మొదలైన పోలింగ్!
-
Telangana ACB: ఏసీబీ అధికారులపై లంచం ఆరోపణలు..!
-
AP Panchayat Elections: పల్లెపోరులో ఏకగ్రీవాల జోరు.. రెండో విడతలో భారీ సంఖ్యలో ఏకగ్రీవాలు
ట్రెండింగ్
-
Life Lessons : అమ్మమ్మ ఇచ్చిన తాళంచెవి.. తరాలకు అందించిన నమ్మకం.!
-
Masala Paneer Paratha Recipe: బ్రేక్‌ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా.. నోరూరించే ‘మసాలా పన్నీర్ పరాటా’ ఇలా చేసుకోండి..!
-
Fridge Cleaning Tips : ఫ్రిజ్ హ్యాండిల్ జిగటగా మారుతోందా?.. ఖరీదైన క్లీనర్లు లేకుండానే ఇలా సులభంగా శుభ్రం చేయండి
-
Kitchen Tips : సగం కోసిన ఉల్లిపాయను ఫ్రిజ్‌లో పెడుతున్నారా?.. ఈ తప్పు చేయొద్దు.!
-
Vaibhav Sooryavanshi: ఆయనతో మాట్లాడిన తర్వాతే ఈ విధ్వంసం సాధ్యమైంది.. 204 పరుగుల సీక్రెట్ బయటపెట్టిన వైభవ్!