Site icon NTV Telugu

రణరంగంగా ఈక్వెడార్ జైలు.. 52మంది దుర్మరణం

ఈక్వెడార్ జైలులో నరమేధం కలకలం రేపింది.జైలులో గత 24 గంటల్లో చోటుచేసుకున్న ఘర్షణల్లో 52మంది ఖైదీలు మరణించారు. 10మందికి పైగా గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అక్కడ కాలిన మృతదేహాలు కనిపించాయి. జైలులో గంటల తరబడి తుపాకీ కాల్పులు, పేలుళ్ల శబ్దాలు వినిపించాయని సమీపంలోని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

జైలులో ఖైదీల నుంచి తుపాకులు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర నేరాలను అణచివేసేందుకోసం గత నెలలో దేశాధ్యక్షుడు గిల్లెర్మో లస్సో జాతీయ అత్యవసర పరిస్థితి విధించారు. ఈ నేపథ్యంలోనే గుయాక్విల్‌ జైలులో ఘర్షణలు జరిగాయి. ఘర్షణల్లో ఎక్కువమందే మరణించి వుండవచ్చని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Exit mobile version