భారతదేశంలో శృంగారం గురించి బయటికి మాట్లాడం పెద్ద నేరంగా భావిస్తారు. అందుకే ఎంతోమంది భార్యాభర్తల మధ్య పెళ్లైన కొద్ది నెలలకే విబేధాలు తలెత్తుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం రొమాన్స్ వి షయంలో యంగ్ జనరేషన్ కొత్త కొత్త ఆలోచనలను చేస్తున్నారు. ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, వన్ నైట్ స్టాండ్స్ అంటూ విదేశీ కల్చర్ ని అలవాటు చేసుకుంటూ వారి వారి అభిప్రాయాలను, అభిరుచులను మార్చుకుంటున్నారు. వీటితో పాటు ప్రస్తుతం ఎకో ఫ్రెండ్లీ సెక్స్ కూడా ట్రెండింగ్ గా మారుతోంది. అసలు ఎకో ఫ్రెండ్లీ సెక్స్ అంటే ఏమిటి..? ఎలా చేస్తారు..?
సాధారణంగా ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి హాని కలిగించని వాటిని అలా పిలుస్తారు. మరి ఎకో ఫ్రెండ్లీ సెక్స్ అంటే కూడా అంతే పర్యవరణానికి హాని కలిగించకుండా శృంగారంలో పాల్గొనడమే ఎకో ఫ్రెండ్లీ సెక్స్. శృంగారానికి, పర్యావరణానికి సంబంధం ఏంటి అంటే.. ప్రస్తుతం యువత త్వరగా పిల్లలను కనే ఉద్దేశంలో లేదు అనడంలో అతిశయోక్తి లేదు. పిల్లలు వద్దు అనుకున్నపుడు కండోమ్స్ కానీ, గర్భ నిరోధక మాత్రలను కానీ వాడుతుంటారు. అయితే అవి చివరకు ఎక్కడికి వెళతాయి.. చెత్తబుట్టలోకేగా.. ఆ చెత్త అంతా భూమిలోకి వెళ్తాయి.. దీనివల్ల పర్యావరణానికి హాని కలిగిస్తుంది. అందుకే ప్రస్తుతం కొన్ని దేశాలు ఎకో ఫ్రెండ్లీ సెక్స్ ని ఎంకరేజ్ చేస్తున్నాయి.
ఇందులో పెళ్లైన వారు త్వరగా పిల్లలు కని, ఆ తర్వాత పిల్లలను కనకుండా ఆపరేషన్ చేసుకోవడం బెటర్ అంటూ ప్రచారం చేస్తున్నాయి. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు పుట్టాక ఆపరేషన్ చేయించుకొని ఎకో ఫ్రెండ్లీ సెక్స్ లో పాల్గొని, పర్యావరణాన్ని కూడా కాపాడండి అంటున్నాయి. గర్భాన్ని నిరోధించడానికి కండోమ్ లు వాడటం మంచిది కాదని, అవి పర్యావరణానికి హాని కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. మరి ఈ ఎకో ఫ్రెండ్లీ సెక్స్ ఎలాంటి పరిణామాలను తీసుకొస్తుందో చూడాలి.
