Site icon NTV Telugu

Earth: భూమి కోర్ తిరగడమే కాదు ఊగుతుంది.. రీసెంట్ స్టడీలో వెల్లడి

Earth

Earth

భూమి గురించి ఎంత తెలుసుకున్నా.. ఎంతో కొంత మిగిలే ఉంటుంది. ఇన్నాళ్లు మనం భూమి మధ్యలో పెద్ద ఐరన్ కోర్ భూమికి భ్రమణానికి వ్యతిరేఖ దిశలో తిరుగుతుందని మనందరికీ తెలుసు. భూమి ఇన్నర్ కోర్ సాలిడ్ గా ఉండీ, ద్రవరూపంలో ఉండే ఐరన్ లో తిరుగుతుండటంతో ఇది జెనరేటర్ గా పనిచేస్తూ బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తోంది. భూ అయస్కాంత క్షేతం( జియో మాగ్నిటిక్ ఫీల్డ్) వల్లే గురుత్వాకర్షణ శక్తి ఏర్పడుతుంది. ఈ బలమైన అయస్కాంత క్షేత్రమే విశ్వం నుంచి వచ్చే ప్రమాదకర కిరణాల నుంచి భూమిని రక్షిస్తోంది.

ఇన్నాళ్లు మనం అంతర్గత కోర్ తిరుగుతుందని అనుకున్నాం. అయితే కోర్ తిరగడంతో పాటు ఊగిసలాడుతుందని పరిశోధనల్లో తేలింది. దీని వల్లే రోజులో వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయని సరికొత్త అధ్యయనం తేల్చింది. ఇప్పుడు యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యూఎస్సీ) శాస్త్రవేత్తలు ఇన్నర్ కోర్ ఊగిసలాడుతూ గత దశాబ్దాలలో దిశను మార్చినట్లు గుర్తించారు.

సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురించబడిన కొత్త అధ్యయనంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 1969,1971 మధ్యాకాలంలో భూమి లోపలి కోర్ నెమ్మదిగా తిరగడాన్ని గుర్తించినట్లు అధ్యయనం చేసి వ్యక్తుల్లో ఒకరైన విడెల్ అన్నారు. కోర్ గతంలో మనం భావించినదాని కన్నా నెమ్మదిగా తిరుగుతుందని స్టడీలో గమనించారు. ఇన్నర కోర్ స్పిన్ లో మార్పు ఆరేళ్ల వ్యవధిలో జరుగుతున్నట్లు పరిశోధకులు గమనించారు. ఇన్నర్ కోర్ సబ్ రొటేషన్ సమయంలో రోజు 0.01 మిల్లి సెకన్లు తగ్గుతుందని.. సూపర్ రొటేషన్ సమయంలో 0.12 సెకన్ల వరకు పెరుగుతుంని డాక్టర్ విడేల్ తెలిపారు.

Exit mobile version