అసలే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. మళ్లీ మద్యరాతి యుగంనాటి పరిస్థితులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్న ప్రజలు తాలిబన్ల రాకతో ఉంటామా లేదా అని సందేహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నెత్తిన మరో ఉపద్రవం వచ్చిపడింది. ప్రకృతి కూడా వారికి సహకరించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఈరోజు ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.8గా నమోదైంది. ఫైజాబాద్‌కు 83 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. దీంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే, ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు.
ఆఫ్ఘన్ నెత్తిన భూకంపం పిడుగు… పరుగులు తీసిన ప్రజలు…
