NTV Telugu Site icon

The Earth: ఇప్పుడైతే భూమిపై 24 గంటలు.. ఒకప్పుడు 19 గంటలు మాత్రమే..

Earth, Moon

Earth, Moon

The Earth: భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎన్ని గంటలు పడుతుందంటే అంతా చటుక్కున 24 గంటలు అని చెప్తారు. ఈ 24 గంటలనే మనం ఒక రోజుగా పరిగణిస్తున్నాము. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని మిల్లిసెకన్ల మేర హెచ్చు తగ్గులు నమోదు అవుతుంటాయి. ఇది కూడా చాలా చాలా అరుదుగా జరుగుతుంది. అయితే కొన్ని మిలియన్ ఏళ్లకు క్రితం భూమిపై ఒక రోజు అంటే 19 గంటలు మాత్రమేనట. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

భూమిపై ఒకప్పుడు కేవలం 19 గంటలు ఉన్న రోజులు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం ఉన్న 24 గంటలకు ఇది పూర్తి విరుద్ధమని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘బోరింగ్ బిలియన్’’ అని పిలువబడే కాలంలో టెక్టానిక్ ప్లేట్స్ కార్యకలాపాలు తక్కువ కావడం, గురుత్వాకర్షణ శక్తుల ప్రభావం కారణంగా భూమి భ్రమణంలో మందగమనం ఏర్పడినట్లు కనుగొన్నారు. నేచర్ జియోసైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో ఈ విషయాన్ని ప్రచురించారు.

బోరింగ్ బిలియన్ యుగంలో చంద్రుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ సమయంలో చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉండటంతో బలమైన గురుత్వాకర్షణ ప్రభావాన్ని భూమి ఎదుక్కొంది. కాలక్రమేణా చంద్రుడు భూమికి దూరంగా, ఇప్పుడు సురక్షిత కక్ష్యలో పరిభ్రమిస్తున్నాడు. మనకు తెలియకుండానే చంద్రుడు భూమి యొక్క కాలాన్ని పొడగిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి చలనం, ఆక్సిస్ టిల్ట్ తో సహా ఖగోళ ప్రభావంతో ఏర్పడే వాతావరణ మార్పులను నమోదు చేసే సైక్లోస్ట్రాటిగ్రఫీ డేటా ఆధారంగా పరిశోధకులు గతాన్ని అణ్వేషించారు.

Read Also: Chicken or Egg: కోడి ముందా.. గుడ్డు ముందా?.. తేల్చేసిన సైంటిస్టులు

1-2 బిలియన్ ఏళ్ల క్రితం సాపేక్ష స్థిరత్వాన్ని వెల్లడించాయి. దీనిని స్నోబాల్ ఎర్త్ ఫేజ్ అని పిలుస్తారు. ఈ యుగంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగాయి. మళ్లీ క్షీణించే సమయంలో ఓజోన్ పొర ఏర్పడటానికి దారి తీసింది. దీన్ని ‘గ్రేట్ ఆక్సిడైజేషన్ ఈవెంట్’గా పిలుస్తారు. ఓజోన్ పొర నీటి ఆవిరి కంటే ఎక్కువ సూర్యరశ్మిని గ్రహించే సామర్థ్యంతో వాతావారణ ఆటుపోట్లను వేగవంతం చేసింది. పెరిగిన సూర్యకాంతి, త్వరణం సమీపంలోని చంద్రుడి గురుత్వాకర్షణ బలాన్ని సమతుల్యం చేసింది. భూమి తిరిగే వేగాన్ని స్థిరీకరించింది. ఈ కాలంలో అధిక సూర్యకాంతిని గ్రహించడం పోటోసింథసిస్ బ్యాక్టీరియా కార్యచరణను పెంచి, మానవ పరిణామానికి బీజం వేసిందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

అంతరిక్షంలో భూమి కదలికల్ని చంద్రుడే కాకుండ ాఇతర గ్రహాలతో సహా, అనేక ఖగోళ వస్తువులు ప్రభావితం చేస్తున్నాయి. ఈ ఖగోళ వస్తువులు భూమి భ్రమణంలో వైవిధ్యాన్ని తీసుకువస్తున్నాయి. ప్రస్తుతం ప్రతీ ఏడాది చంద్రుడు భూమి నుంచి దూరం అవుతున్నాడు. దీంతో రోజులు క్రమంగా ఏడాదికి 0.000015 సెకన్లు పెరుగుతున్నాయి.

Show comments