Site icon NTV Telugu

Dubai Princess: దుబాయ్‌ యువరాణి మళ్లీ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఫొటోలు

Dubai Princess

Dubai Princess

దుబాయ్‌ యువరాణి షేకా మహ్రా మళ్లీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. గతేడాది సోషల్ మీడియాలో భర్తకు విడాకులు ప్రకటించి సంచలనం సృష్టించిన ఆమె.. తాజాగా మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ప్రముఖ ర్యాపర్‌ ఫ్రెంచ్‌ మోంటానా(40)తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని ర్యాపర్‌ అధికార ప్రతినిధి ధ్రువీకరించినట్లు ఓ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది. దీంతో దుబాయ్ యువరాణి వార్తల్లో నిలిచింది.

ఇది కూడా చదవండి: Kamal Haasan: ట్రంప్ సుంకాలపై భారత్‌కు కమల్‌హాసన్ కీలక సూచనలు

భర్తకు విడాకులు ఇచ్చిన దగ్గర నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు షికార్లు చేశాయి. ఇద్దరూ కలిసి దుబాయ్‌ వీధుల్లో.. రెస్టారెంట్లలో ప్రత్యక్షమయ్యారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో కూడా కనిపించారు. అప్పటికే వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఇద్దరికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Box office results : అనుకున్నదే జరిగింది.. కూలీ, వార్ 2 ని వెనక్కి నెట్టిన రీజనల్ సినిమా

31 ఏళ్ల షేకా మహ్రా.. దుబాయ్‌ పాలకుడు, యూఏఈ ప్రధానమంత్రి షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌ కుమార్తె. బ్రిటన్‌లో ఉన్నతవిద్య అభ్యసించిన ఆమె అంతర్జాతీయ వ్యవహారాల్లో పట్టా పొందారు. దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త షేక్‌ మనా బిన్‌ మొహమ్మద్‌ అల్‌ మక్తూమ్‌తో మే 27, 2023న వివాహం జరిగింది. అయితే ఈ బంధం ఎంతోకాలం నిలువలేదు. గతేడాది బిడ్డకు జన్మనిచ్చిన కొంతకాలానికే ఆమె భర్త నుంచి విడిపోయారు. ఆ సమయంలో డివోర్స్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్టు చేసింది.

ఫ్రెంచ్ మోంటానా అసలు పేరు కరీం ఖర్బౌచ్. ‘అన్‌ఫర్‌గటబుల్‌’, ‘నో స్టైలిస్ట్‌’ వంటి ఆల్బమ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నారు. ఉగాండా, ఉత్తర ఆఫ్రికా అంతటా ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం, దాతృత్వంతో ఖ్యాతిని గడించారు. ఫ్రెంచ్ మోంటానా 2007 నుంచి 2014 వరకు వ్యవస్థాపకుడు, డిజైనర్ నదీన్ ఖర్బౌచ్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు 16 ఏళ్ల కుమారుడు క్రుజ్ ఖర్బౌచ్ ఉన్నారు.

Exit mobile version