Dubai Man Buys World Most Expensive P 7 Number Plate: కొందరు బడా వ్యక్తులు.. తమకు నచ్చిన వస్తువులను చేజిక్కించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అది కారు నెంబర్ అయినా సరే. ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకోవాలనుకుంటే.. కోట్లలో వేలం పాట పాడ్డానికైనా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా సరిగ్గా అలాంటి పనే చేశాడు. వీఐపీ నెంబర్ ప్లేట్ ‘P 7’ను సొంత చేసుకోవడం కోసం ఏకంగా రూ.122.6 కోట్లు ఖర్చు పెట్టారు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం. దీంతో.. ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ప్లేట్‌ను విక్రయించిన వాడిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు.
Niharika Konidela: మొన్న చైతన్య.. నేడు నిహారిక.. ఏంటీ విడాకుల గోల..?
ఏప్రిల్ 8వ తేదీన దుబాయ్‌లో ఎమిరేట్స్ సంస్థ మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలాన్ని నిర్వహించింది. వన్ బిలియన్ మీల్స్ కూడా ఈ క్యాంపెయిన్‌కు మద్దతుగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో భాగంగా ‘P 7’ కారు నెంబర్ ప్లేట్ కోసం 15 మిలియన్ AED వద్ద వేలం పాట మొదలైంది. సెకన్ల వ్యవధిలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ AEDని దాటేసింది. అప్పుడు టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు, యజమాని పావెల్ వాలెరివిచ్ డ్యూరోవ్ 35 మిలియన్ AEDతో వేలం వేశారు. అక్కడి నుంచి ఒక దశలో ఈ బిడ్డింగ్ కాసేపు ఆగిపోయింది. చివరికి ఈ బిడ్డింగ్ 55 మిలియన్ దిర్హామ్‌ల (భారత కరెన్సీలో రూ.122.6 కోట్లు) వద్ద ముగిసింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ వేలం పాటలో అంత భారీ మొత్తానికి ఆ నెంబర్ ప్లేట్‌ని ఎవరు సొంతం చేసుకున్నారన్నది మాత్రం తెలియరాలేదు.
Ponguleti Srinivas Reddy: నన్ను సస్పెండ్ చేయడం హాస్యాస్పదం.. వందలసార్లు పిలిచినా వెళ్లలేదు
గతంలో 2008లో ఒక వ్యాపారవేత్త అబుదాబి నంబర్ 1 ప్లేట్‌ను AED 52.22 మిలియన్లకు సొంతం చేసుకున్నప్పుడు.. అది రికార్డ్‌గా నిలిచింది. ఇన్నాళ్లూ అది చెరగని రికార్డ్‌గా మిగిలిపోగా.. తాజాగా జరిగిన వేలంపాటతో అది బద్దలైపోయింది. ఇదే సమయంలో ఇతర వీఐపీ నెంబర్ ప్లేట్లు, ఫోన్ నంబర్‌లు కూడా వేలం వేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో సుమారు 100 మిలియన్ దిర్హామ్‌లు ($27 మిలియన్లు) వసూలయ్యాయి. ఈ డబ్బును రంజాన్ సందర్భంగా ప్రజలకు ఆహారం ఇచ్చేందుకు ఉపయోగించనున్నారు. రంజాన్ స్ఫూర్తికి అనుగుణంగా వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఈ విరాళాన్ని అందించారు.