NTV Telugu Site icon

Dostarlimab: గుడ్‌న్యూస్.. క్యాన్సర్‌కు మందు దొరికేసిందోచ్

Cancer Medicine

Cancer Medicine

క్యాన్సర్ మహమ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. క్యాన్సర్‌ను నయం చేసే నిఖార్సైన మందు లేకపోవడమే దీనికి కారణమన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే క్యాన్సర్ మహమ్మారికి ఇక రోజులు దగ్గరపడినట్లే అనిపిస్తోంది. చరిత్రలోనే తొలిసారిగా క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఒక గర్భాశయ క్యాన్సర్ ఔషధం చూపిన ఫలితం వైద్యులను ఆశ్చర్యపరుస్తోంది. అత్యంత ప్రమాదకరమైన పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న కొంత మంది క్యాన్సర్ పేషెంట్లకు క్లినికల్ ట్రయల్‌లో భాగంగా డోస్టార్‌లిమాబ్ అనే ఔషధాన్ని సైంటిస్టులు ప్రయోగించారు. ఈ ఔషధం వాడిన తర్వాత రోగుల్లో క్యాన్సర్ తగ్గిపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. రోగుల శరీరంలో క్యాన్సర్ కణాలన్నీ అంతమైనట్లు వివరిస్తున్నారు.

Viral Video: చింపాంజీతో గేమ్స్.. రా..రా అన్నాడు.. ఇరుక్కుపోయాడు..!!

మొత్తం 18 మంది రోగులకు డోస్టార్‌లిమాబ్ అనే ఔషధాన్ని ఇవ్వగా 12 నెలల తర్వాత వారిలో క్యాన్సర్ అదృశ్యమైనట్లు పరిశోధకులు గుర్తించారు. కోర్సు పూర్తయ్యే నాటికి ప్రతి ఒక్క రోగిలో క్యాన్సర్ పూర్తిగా నిర్మూలన అయ్యింది. అయినా ఏదో మూలన అనుమానంతో వైద్యులు రోగులకు ఎండోస్కోపీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ లేదా PET స్కాన్‌లు, MRI స్కాన్‌లు నిర్వహించారు. ఎలాంటి స్కాన్‌లలోనూ క్యాన్సర్ కణాలు కనిపించలేదు. అంతేకాదు శరీరంలో ఇతర ఏ అవయవాలకు క్యాన్సర్ కణాలు వ్యాప్తి చెందలేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో క్యాన్సర్ చికిత్సకు సంబంధించి రోగుల్లో మళ్లీ కొత్త ఆశలు చిగురించాయి. ఈ ఔషధంపై మరిన్ని పరిశోధనలు జరపాలని వైద్య రంగానికి చెందిన పలువురు నిపుణులు సూచిస్తున్నారు. డోస్టార్‌లిమాబ్ అనేది అణువులతో కూడిన ఔషధం అని.. ఇది మానవ శరీరంలో ప్రత్యామ్నాయ ప్రతిరోధకాలుగా పనిచేస్తుందని అమెరికా సైంటిస్టులు వివరిస్తున్నారు.