Site icon NTV Telugu

ఉత్త‌ర కొరియాలో ఆ రంగు జీన్స్ ధ‌రిస్తే… ఇక అంతే…

ఉత్త‌ర కొరియాలో అక్క‌డి నియమాల‌కు విరుద్దంగా ఏం చేసినా క‌ఠిన‌మైన శిక్ష‌లు విధిస్తారు.  ప్ర‌భుత్వం ఎలా చెబితే అక్క‌డి ప్ర‌జ‌లు అలా న‌డుచుకోవాల్సిందే.  అతిక్ర‌మించి ఎవ‌రూ కూడా అక్క‌డ బ‌తికి బ‌ట్ట‌క‌ట్ట‌లేరు.  తినే ఆహారం ద‌గ్గ‌ర నుంచి, క‌ట్టుకునే బ‌ట్ట వ‌ర‌కు ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన మేర‌కే ఉండాలి.  బ‌ట్ట‌ల విష‌యంలో కిమ్ ప్ర‌భుత్వం చాలా సీరియ‌స్‌గా వ్వ‌వ‌హ‌రిస్తుంది.  

Read: వైర‌ల్ః బ‌ర్త్‌డే పార్టీకి ఆ సింహ‌మే చీఫ్ గెస్ట్‌…నెటిజ‌న్లు ఆగ్ర‌హం

కొరియా సంస్కృతికి విరుద్ధంగా ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా దుస్తులు ధ‌రించ‌కూడదు.  పాశ్చాత్యపోక‌డ‌ల‌కు ఆ దేశం దూరంగా ఉంటుంది.  ఇప్పుడిప్పుడే ఆ దేశంలో జీన్స్ ల‌కు అనుమ‌తి ఇస్తున్నారు.  అయితే, ఎట్టిప‌రిస్థితుల్లో కూడా ఉత్త‌ర కొరియాలో బ్లూక‌ల‌ర్ జీన్స్ ధ‌రించ‌కూడ‌దు.  ఎందుకంటే ఆ రంగు అమెరికాను సూచిస్తుంద‌ట‌.  అమెరికా అంటే కొరియాకు అస్స‌లు ప‌డ‌దు.  కిమ్ పాల‌న మొద‌ల‌య్యాక రెండు దేశాల మ‌ధ్య దూరం మ‌రింత‌గా పెరిగింది.  

Exit mobile version