Site icon NTV Telugu

Donald Trump: సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్.. చైనాకు మాత్రం భారీ షాక్..

Donald Trump

Donald Trump

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు యూఎస్ నిర్ణయంతో సతమతమయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచ స్టాక్ మార్కెట్లు సైతం తీవ్రంగా నష్టల బాట పట్టాయి. అలాగే, ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడే ప్రమాదం ఉందని పలు నివేదికలు అంచనా వేశారు. ఇక, అమెరికా వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు యూఎస్ తీసుకున్న ఈ చర్యలపై అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. దీంతో డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల విషయంలో వెనక్కి తగ్గాడు.

Read Also: Vishvambhara : ‘విశ్వంభర’ షూటింగ్ అప్ డేట్..

ఇక, ట్రంప్ అన్ని దేశాలపై పరస్పర సుంకాలను సుమారు 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే, ఈ మూడు నెలల పాటు కనీసం 10 శాతం పన్నులు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో మార్కెట్‌లలో ఒడిదుడుకులు, వివిధ దేశాల నుంచి వచ్చిన ఆందోళనలతోనే ట్రంప్ వెనక్కి తగ్గారు. కానీ, డ్రాగన్ కంట్రీ చైనాకు మాత్రం అమెరికా అధ్యక్షుడు మరోసారి భారీ షాక్ ఇచ్చాడు. ఈ సారి పన్నులను 125 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని శ్వేత సౌధం కూడా ధృవీకరించింది. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం గ్లోబల్ మార్కెట్‌లపై తాత్కాలిక ఉపశమం కల్పిస్తుందన్నారు. కాగా, చైనాతో వాణిజ్య ఉద్రిక్తత పెరిగే ఛాన్స్ ఉందని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version