అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల తర్వాత ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఇటీవల ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఆయన చెవికి బుల్లె్ట్ తగిలి తీవ్ర గాయమైంది. దీంతో మెడికల్ ట్రీట్‌మెంట్ తర్వాత ఆయన చెవికి బ్యాండేజీ వేశారు. అయినా కూడా రెస్ట్ తీసుకోకుండా విరామం లేకుండా ప్రచారం చేస్తున్నారు. దీంతో ఆయనకు విపరీతమైన సానుభూతి లభిస్తోంది. ఆయన ఏ సభల్లో పాల్గొన్న.. అభిమానులు కూడా చెవికి బ్యాండేజీలు వేసుకుని సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Constipation: మలబద్ధకం నుంచి బయట పడాలనుకుంటున్నారా..? ఇవి ట్రై చేయండి..
అమెరికాలో ఇప్పుడు చెవులకు బ్యాండేజీలు వేసుకోవడం ఫ్యాషన్‌గా మారింది. ట్రంప్ కుడిచెవికి గాయం కారణంగా ఆయన బ్యాండేజీ వేసుకున్నారు. ఆయన అభిమానులు అలానే వేసుకుంటూ సపోర్టు చేస్తు్న్నారు. ఇటీవల రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో పాల్గొన్న రిపబ్లికన్లు.. వినూత్న రీతిలో ఆయనకు మద్దతు తెలిపారు. తమ కుడి చెవికి తెల్లటి బ్యాండేజీలను కట్టుకుని సంఘీభావం తెలియజేశారు.
ఇది కూడా చదవండి: Video Game At Surgery: సర్జరీ చేస్తుండగా వీడియో గేమ్ ఆడిన యువకుడు.. (వీడియో)
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలో విస్కాన్సిన్‌లోని మిల్వాకీలో ఇటీవల జరిగిన జాతీయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. అక్కడికి విచ్చేసిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. అప్పుడు చెవికి బ్యాండేజీతో కనిపించారు. అదే సమయంలో అక్కడున్న చాలా మంది చెవులకు తెల్ల బ్యాండేజీ కట్టుకుని మద్దతు తెలియజేశారు. కాగా పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. ఈ ఘటన తర్వాత ట్రంప్‌నకు విజయావకాశాలు భారీగా పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. ప్రజల్లో మద్దతు ఒక్కసారిగా 8 శాతం పెరిగినట్లు పేర్కొన్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచేందుకు 70శాతం అవకాశాలున్నట్లు అంచనా వేసింది. ఈ క్రమంలోనే తాజాగా చెవికి బ్యాండేజీలతో ట్రంప్‌నకు మద్దతు తెలపడం ఆసక్తికరంగా మారింది.