Donald Trump: మరో రెండు వారాల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి కమలా హారిస్‌లు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యంత సంపన్నుల జాబితాలో ట్రంప్ మరోసారి స్థానం దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ సూచీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని 500 మంది సంపన్నుల జాబితాలో ట్రంప్ 481వ స్థానంలో కొనసాగుతున్నారు. సెప్టెంబరు చివరిలో డొనాల్డ్ ట్రంప్ మీడియా- టెక్నాలజీ గ్రూప్‌లోని ట్రూత్ సోషల్ మీడియా షేర్లు మూడు రెట్లు పెరిగింది. దీంతో ఆయన సంపద 6.5 బిలియన్ డాలర్లకు పెరిగిపోయింది.
Read Also: Pumpkin Seeds: పురుషులలో సంతానోత్పత్తి మెరుగుపడాలంటే వీటిని వాడాల్సిందే
ఇక, నవంబరు 5వ తేదీన యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున పోటీ చేస్తున్న కమలా హారిస్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పలు సర్వేలు తెలియజేస్తున్నాయి. మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌నకు సైతం గెలిచే ఛాన్స్ ఉన్నట్లు పలువురు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన సంపన్నుల జాబితాలో మరోసారి చోటు దక్కించుకున్నారు.