Site icon NTV Telugu

Viral: ఎయిర్‌పోర్టులో తప్పించుకున్న శునకం.. సిబ్బందికి చుక్కలు..!

Dog Runs

Dog Runs

వీధు కుక్కలు సరేసరి.. వాటి ఇష్టారాజ్యం.. కానీ, పెంపుడు కుక్కలు రోజుకు ఒకసారి లేదా రెండు మూడుసార్లు బయటకు తిప్పడం మళ్లీ ఇంట్లో పెట్టడం చేస్తుంటారు.. అయితే, ఏమైందో..? ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఓ శునకం ఎయిర్‌పోర్ట్‌లోప్రత్యక్షమైంది.. రన్‌వేపై పరుగులు పెడుతూ.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి చుక్కలు చూపించింది.. దీనికి సంబంధించిన వీడియోను చిత్రీకరించిన ఓ వ్యక్తి.. సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో.. అది కాస్తా వైరల్‌గా మారిపోయింది. ఎయిర్‌పోర్ట్‌లో పరుగులు పెట్టడమే కాదు.. లక్షల్లో వ్యూస్‌.. వేలల్లో షేర్లు, లైక్‌లతో సోషల్‌ మీడియాలోనూ రన్నింగ్‌ చేస్తోంది ఆ శునకం..

Read Also: Chandrababu: ఇది రాష్ట్రానికి అవమానం.. వ్యవస్థల పతనానికి నిదర్శనం..!

మెక్సిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్వడలాజరలో గల మిగ్వుల్ హిడాల్గొ వై కాస్టిల్లా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కతో వచ్చింది.. అయితే, సరిగ్గా బోర్డిండ్‌ సమయానికి కుక్కకు కట్టిన తాడు తెగిపోయిందట.. అసలే బంధించిన కుక్కను ఒక్కసారిగా విడిచిపెడితే.. అది ఊరుకుంటుందా.. పరుగులు పెడుతూ విమానం నుంచి బయటకు వెళ్లిపోయింది.. విమానం కింద, రన్‌వేపై రన్‌ అందుకుంది… అది కాస్తా విమానాల రాకపోకలకు ఇబ్బంది కలిగే అవకాశం ఉండడంతో.. దానిని పట్టుకోవడానికి అధికారులు, సిబ్బంది రంగంలోకి దిగారు.. అయినా ఎంతకూ అది దొరకలేదు.. దానిని పట్టుకోవడానికి అంతా పరుగోపరుగు అనాల్సి వచ్చింది.

మొత్తంగా చివరకు ఆ శునక రాజును పట్టుకుని ఊపిరి పీల్చుకున్నారు అధికారులు, సిబ్బంది.. అయితే, ఏదైనా కాస్త కొత్తగా కనిపిస్తే.. ఇట్టే తమ కెమెరాలో బంధించి.. వెంటనే సోషల్‌ మీడియాకు ఎక్కించడం సర్వసాధారణమైన ఈ రోజుల్లో.. ఎయిర్‌పోర్ట్‌లో శునకం పరుగులు, అధికారులు, సిబ్బంది అవస్థలను తన మొబైల్‌ ఫోన్‌లో చిత్రీకరించిన ఓ వ్యక్తి.. దానిని సోషల్ మీడియాలో షేర్‌ చేయడంతో.. వైరల్‌గా మారిపోయింది.. ఇక, నెటిజన్లు కొందరు శునకం రన్నింగ్‌పై ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు.. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది పడిన కష్టంపై కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version