Site icon NTV Telugu

అమెరికాను భ‌య‌పెడుతున్న డెల్టా… కేసులు పెరిగినా…

ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం డెల్టా వేరియంట్ వేగంగా విస్త‌రిస్తున్న‌ది.  130కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపించింది.  అమెరికాకు కొత్త అధ్య‌క్షుడిగా ఎంపిక‌య్యాక జో బైడెన్ 100 రోజుల కార్యాచ‌ర‌ణ‌ను తీసుకొచ్చారు.  100 రోజులు ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ పెట్టుకోవాల‌ని,  ఆ త‌రువాత అవ‌స‌రం లేద‌ని అన్నారు.  100 రోజుల కార్య‌చ‌ర‌ణ త‌రువాత మాస్క్‌ను త‌ప్ప‌ని స‌రి నుంచి తొల‌గించారు.  ఆ త‌రువాత క‌థ మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది.  గ‌త ప‌ది రోజుల నుంచి ఆ దేశంలో కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.  రోజువారి కేసులు ల‌క్ష దాటిపోతున్నాయి.  

Read: బంపర్ ఆఫర్: టీకా వేసుకుంటే వ్యాక్సిన్ వోచర్లు…

తీవ్ర‌త పెరుగుతుండ‌టంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతున్న‌ది.  మ‌ర‌ణాల సంఖ్య సైతం పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  అయితే, క‌రోనా కేసులు పెరిగిన‌ప్ప‌టికీ లాక్ డౌన్ విధించే అవ‌కాశం లేద‌ని, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన వారు ఇంకా 10 కోట్ల మంది ఉన్నార‌ని వారంద‌రికీ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంద‌ని, ఇండోర్ వంటి ప్రాంతాల్లో వ్యాక్సిన్ తీసుకున్న వ్య‌క్తులు సైతం మాస్క్ పెట్టుకోవాల‌ని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోని ఫౌచీ పేర్కొన్నారు.  ఫ్లోరిడా వంటి న‌గ‌రాల్లో ఈ వేరియంట్ కేసులు అధికంగా న‌మోదువుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.  

Exit mobile version