Site icon NTV Telugu

అక్క‌డ డెల్టా వేరియంట్ పంజా… ఆసుప‌త్రులు కిట‌కిట‌…

ప్రపంచాన్ని డెల్టా వేరియంట్ అతలాకుత‌లం చేస్తున్న‌ది.  కేసులు భారీ స్థాయిలో పెర‌గ‌డానికి, తీవ్ర‌త పెర‌గ‌డానికి ఆ డెల్టా వేరియంట్ ప్ర‌ధాన కార‌ణం.  అమెరికాలో సైతం కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  ఇండియా పొరుగుదేశం శ్రీలంక‌లోనూ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  డెల్టా వేరియంట్ కేసులు అధిక‌మ‌వ్వ‌డంతో ఆ దేశం కీల‌క హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.  ప్ర‌జ‌లు ఇంటివ‌ద్ద‌నే ఉండాల‌ని, సాద్య‌మైనంత వ‌ర‌కు బ‌య‌ట‌కు రాకుండా ఉండేందుకు ప్ర‌యత్నించాల‌ని కోరింది.  డెల్టా వేరియంట్ కార‌ణంగా ఆసుపత్రుల‌పై ఒత్తిడి పెరిగిన‌ట్టు అధికారులు చెబుతున్నారు.  డెల్టా వేరియంట్ సోకిన వారిలో 1.5 శాతం మంది మృతిచెందుతున్న‌ట్టు గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఆసుప‌త్రుల్లో చేరుతున్న రోగుల్లో ఎక్కువ‌శాతం మందిని ఐసీయూలో ఉంచాల్సిన ప‌రిస్థితులు ఉన్నాయ‌ని క‌రోనా నిబంధ‌న‌లు త‌ప్ప‌ని స‌రిగా పాటించాల‌ని వైద్య‌నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  లాక్‌డౌన్ విధించే అవ‌కాశం లేద‌ని, ఆంక్ష‌లు మాత్రం కొన‌సాగుతాయ‌ని నిపుణులు చెబుతున్నారు.  

Read: ఎన్టీఆర్ కు గాయం… క్లారిటీ ఇచ్చిన “ఆర్ఆర్ఆర్” టీం

Exit mobile version