Site icon NTV Telugu

వ్యాక్సిన్ తీసుకోకుంటే జీతం కట్‌… ఎయిర్‌లైన్స్ సంస్థ కీలక ప్ర‌క‌ట‌న‌…

క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే త‌ప్ప‌ని స‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.  క‌రోనా నుంచి మ‌నల్ని మ‌నం ర‌క్షించుకోవాలంటే ఇదొక్క‌టే మార్గం.  అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేగంగా వ్యాక్సినేష‌న్ ను కొన‌సాగిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటే, అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స సంస్థ వ్యాక్సిన్ పై కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  త‌మ సంస్థ‌లో ప‌నిచేసే ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ఆ కంపెనీ ఆదేశాలు జారీ చేసింది.  వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను కూడా అమ‌లు చేసింది.  అయితే, కొంత‌మంది ఇంకా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉండ‌గా కంపెనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.  త‌మ సంస్థ‌లో ఎవ‌రైనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఉంటే వారి జీతాల్లో నుంచి ప్ర‌తినెలా రూ.15 వేలు క‌ట్ చేస్తామ‌ని ప్ర‌కటించింది.  సెప్టెంబ‌ర్ 27 లోగా ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ష‌ర‌తు పెట్టింది.  ఆ త‌రువాత వ్యాక్సిన్ తీసుకోని వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించింది.  

Read: మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌రికొత్త రికార్డ్‌: గంట‌లో ల‌క్ష‌మందికి వ్యాక్సిన్‌…

Exit mobile version