Site icon NTV Telugu

Delhi: పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్ ను పట్టుకున్న పోలీసులు

Untitled Design (10)

Untitled Design (10)

దేశ రాజధానిలోకి పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు ఉన్న ఓ గూడాచారిని ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ గూఢచారి వలయాన్ని పోలీసులు చేధించారు. ప్రస్తుతం ఈ విషయం ఢిల్లీలో సంచలనంగా మారింది. ఇంటలీజెన్స్ రిపోర్ట్ ఆధారంగా అతడిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also:Fenugreek Seeds: శరీరంలోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లోలో పాకిస్థాన్ ఐఎస్ఐ సంబంధాలు కలిగిన నెట్ వర్క్ ను పోలీసులు కనుగొన్నారు. పాకిస్తాన్ అణ్వాయుధ గూఢచారి వలయాన్ని ఢిల్లీ పోలీసులు చేధించారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ 59 ఏళ్ల మహమ్మద్ ఆదిల్ హుస్సైనీ అలియాస్ సయ్యద్ ఆదిల్ హుస్సైన్, నసీముద్దీన్, సయ్యద్ ఆదిల్ హుస్సైనీని గూఢచార్యం, నకిలీ పాస్‌పోర్ట్ రాకెట్‌లో పాల్గొన్నారనే ఆరోపణలపై అరెస్టు చేశారు.

Read Also:Condoms: ఏందిరా ఇది… గర్ల్స్ హాస్టల్ ముందు భారీగా కండోమ్స్

ఢిల్లీలో స్పెషల్ సెల్ ద్వారా పాకిస్తాన్ గూఢచారి ఆదిల్ హుస్సేని అరెస్టు చేశారు. ఇది ఒక ప్రధాన గూఢచర్య నెట్‌వర్క్‌ను వెలికితీసింది. నిఘా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. విచారణలో హుస్సేని ‘ఒక రష్యన్ శాస్త్రవేత్త నుండి అణు డిజైన్‌ను తీసుకొని ఇరాన్‌కు చెందిన ఒక శాస్త్రవేత్తకు విక్రయించాడని’ వెల్లడించాడు. ఈ ఆపరేషన్ ముంబైలో అతని సోదరుడు అక్తర్ హుస్సేని అరెస్టుకు దారితీసింది. గూఢచారి బృందానికి పాకిస్తాన్ ISIతో సంబంధాలు ఉన్నాయని మరియు భారతదేశ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లోని వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. జార్ఖండ్‌కు చెందిన 59 ఏళ్ల ఆదిల్‌ను ఢిల్లీలో అరెస్టు చేశారు. పోలీసులు ఈ కేసుపై ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Exit mobile version