US Cuba Drone Tension: ఇరాన్‌కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Cuba Drone Tension: అమెరికాకు అత్యంత సమీపంలో ఉండే చిన్న ద్వీప దేశం క్యూబా.. అగ్రరాజ్యం అమెరికాకు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవల క్యూబా రష్యా – ఇరాన్‌ల నుంచి 300కు పైగా అత్యాధునిక సైనిక డ్రోన్లను కొనుగోలు చేసినట్లు ఒక అమెరికా నివేదిక వెల్లడించింది. ఈ డ్రోన్లను క్యూబా తన సమీపంలోని అమెరికా సైనిక స్థావరాలు (గ్వాంటనామో బే వంటివి), నౌకాదళ నౌకలపై దాడి చేయడానికి ఉపయోగించవచ్చని వాషింగ్టన్ తీవ్రంగా భయపడుతోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం క్యూబా గూఢచార సంస్థతో పాటు ఆ దేశ అగ్ర నాయకులపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీనిపై క్యూబా అధ్యక్షుడు మిగెల్ డియాజ్ – కానెల్ తీవ్రంగా స్పందించారు. అమెరికా గనుక తమపై సైనిక దాడికి దిగితే అది “భారీ రక్తపాతానికి” దారితీస్తుందని హెచ్చరించారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని క్యూబా స్పష్టం చేసింది.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
యుద్ధం అంత సులభం కాదు! ఎందుకంటే..
క్యూబా వద్ద అమెరికా రేంజ్ ఆధునిక ఆయుధ సంపత్తి లేకపోవచ్చు, కానీ డిఫెన్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యూబాతో ప్రత్యక్ష యుద్ధం అమెరికాకు అత్యంత ఖరీదైనదిగా, సుదీర్ఘమైనదిగా మారే ప్రమాదం ఉంది. ఇందుకు క్యూబా అనుసరిస్తున్న కొన్ని ప్రత్యేక వ్యూహాలే కారణం..
1. ‘మనుషులందరి యుద్ధం’
క్యూబా సైన్యం యొక్క అతిపెద్ద బలం దాని ‘ప్రజలందరి యుద్ధం’ విధానం. దేశంపై దాడి జరిగితే కేవలం సైన్యమే కాదు, పౌరులంతా రంగంలోకి దిగుతారు. క్యూబాలో సుమారు 50,000 మంది క్రియాశీల సైనికులు, 39,000 మంది రిజర్వ్ సైనికులు, 90,000 మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. అత్యవసర పరిస్థితి వస్తే ఏకంగా 10 లక్షలకు పైగా ప్రజలను యుద్ధ రంగానికి తరలించేలా ప్లాన్ రెడీ చేశారు. ప్రస్తుతం ఇరాన్ వ్యూహాల సాయంతో క్యూబా పౌరులకు గెరిల్లా యుద్ధంలో విస్తృత శిక్షణ ఇస్తున్నారు.
2. భౌగోళిక స్థానం
క్యూబా భౌగోళికంగా అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి (కీ వెస్ట్) కేవలం 90 మైళ్ల దూరంలో ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే అమెరికా తన తీర ప్రాంతాలను, నావికా స్థావరాలను కాపాడుకోవడానికే భారీగా వనరులను కేటాయించాల్సి వస్తుంది. క్యూబా ప్రయోగించే చిన్న డ్రోన్లు కూడా అమెరికా భూభాగంపై పెద్ద సవాలుగా మారగలవు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
3. ‘జుగాడ్’ టెక్నిక్స్ – గెరిల్లా మోడల్
ఆధునిక ఆయుధాల కొరతను అధిగమించడానికి క్యూబా వినూత్న ‘జుగాడ్’ (తాత్కాలిక సాంకేతికత) విధానాలను వాడుతోంది. పాత ట్రక్కులపై విమాన విధ్వంసక తుపాకులను అమర్చడం, పాత సోవియట్ కాలపు ఆయుధాలను రీమోడల్ చేయడం ద్వారా హైబ్రిడ్ యుద్ధ వాహనాలను తయారు చేసింది. ఎదురుదాడికి వెళ్లకుండా శత్రువును అలసిపోయేలా చేసే గెరిల్లా యుద్ధ పద్ధతిపైనే వీరు ఎక్కువగా నమ్ముకున్నారు.
లాటిన్ అమెరికాలో క్యూబా గూఢచార వ్యవస్థ అత్యంత శక్తివంతమైనది. విప్లవ సాయుధ దళాలకు (FAR) చెందిన ‘GAESA’ గ్రూప్ దేశంలోని హోటళ్లు, బ్యాంకులు, విమానాశ్రయాలను నియంత్రిస్తూ ఆర్థిక వ్యవస్థపై బలమైన పట్టు సాధించింది. అయితే ఇటీవల వెనిజులాలోని మదురో ప్రభుత్వ అణచివేత చర్యల వల్ల క్యూబాకు చెందిన 32 మంది ఇంటెలిజెన్స్ ఏజెంట్లు హతమవ్వడం ఆ దేశానికి పెద్ద ఎదురుదెబ్బగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.
క్యూబా సైన్యానికి ఉన్న అతిపెద్ద బలహీనతలు ఇవే..
వ్యూహాత్మకంగా బలంగా ఉన్నప్పటికీ, క్యూబా అంతర్గతంగా తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. క్యూబా వైమానిక దళంలో మిగ్ – 29, మిగ్ – 23 వంటి పాతబడిన కేవలం 20 విమానాలు మాత్రమే పని చేస్తున్నాయి. నౌకాదళంలో ఆధునిక జలాంతర్గాములు లేవు, కేవలం 33 చిన్న నౌకలు మాత్రమే సేవలందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో తీవ్రమైన విద్యుత్ కోతలు నడుస్తున్నాయి. ఇంధనం, విడిభాగాల కొరత వల్ల సైనిక కమ్యూనికేషన్, శిక్షణకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఏది ఏమైనప్పటికీ రష్యా – ఇరాన్ లతో క్యూబా పెంచుకుంటున్న రక్షణ బంధం, 300 కొత్త డ్రోన్ల నిల్వ.. కేవలం కరేబియన్ ప్రాంతంలోనే కాక, అమెరికా సరిహద్దుల్లో ఒక కొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతకు దారితీస్తోందని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Parliament Session 2026: 2015 రికార్డు బ్రేక్.. పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
-
Soori: భారీగా పెరిగిన కమెడియన్ సూరి రెమ్యూనరేషన్.. రేంజ్ చూస్తే షాకవ్వాల్సిందే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
Realme 16T 5G: 8000mAh బ్యాటరీతో అదరగొట్టే 5G ఫోన్.. 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
ట్రెండింగ్
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!