Site icon NTV Telugu

షాకింగ్ న్యూస్‌: మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా…. జ‌రభ‌ద్రం…

ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరిగిపోతుండ‌టంతో వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  ప్ర‌స్తుతం ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్న‌ది.  ఈ వేరియంట్ వ్యాప్తి అధికంగా ఉన్న‌ప్ప‌టికీ, తీవ్ర‌త త‌క్కువ‌గా ఉండ‌టంతో పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని నిపుణులు చెబుతున్నారు.  డెల్టా వేరియంట్ వ్యాప్తి కాస్త త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ తీవ్ర‌త అధికంగా ఉండ‌టంతో మ‌ర‌ణాల సంఖ్య అధికంగా ఉన్న‌ది.  గ‌తంలో మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా సోకుతున్న‌ట్టుగా నిర్ధార‌ణ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.  డెల్టా వేవ్ స‌మ‌యంలో సౌతాఫ్రికాలోని జోహెన్స్ బ‌ర్గ్ జూలో మూడు ఆఫ్రిక‌న్ సింహాలు క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే.  మూడు సింహాలు కోలుకోవడానికి సుమారు 10 రోజుల స‌మ‌యం ప‌ట్టింది.  అయితే, ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కార‌ణంగా మ‌నుషుల నుంచి జంతువుల‌కు క‌రోనా సోక‌కుండా ఉండేందుకు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.  

Read: బ‌హిరంగ మార్కెట్లోకి కోవిడ్ టీకాలు…!!

Exit mobile version