NTV Telugu Site icon

Ukraine: విద్యార్ధులు విద్య‌కోసం ఉక్రెయిన్‌కే ఎందుకు వెళ్తారో తెలుసా?

విద్యార్ధులు విద్య‌కోసం విదేశాల‌కు వెళ్లాలి అనుకున్న‌ప్పుడు అంద‌రికి గుర్తుకు వ‌చ్చే దేశం ఉక్రెయిన్‌. ఉక్రెయిన్‌లో విద్య‌ను అభ్య‌సించేందుకు పెద్ద సంఖ్య‌లో ఇండియా నుంచి వెళ్తుంటారు. ముఖ్యంగా మెడిక‌ల్ విద్య‌ను అభ్య‌సించేందుకు వెళ్తుంటారు. ఉక్రెయిన్‌లో విద్య‌ను అభ్య‌సించేందుకు వెళ్ల‌డం వెనుక కార‌ణం లేక‌పోలేదు. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలతో పోల్చుకుంటే ఉక్రెయిన్‌లో లివింగ్ కాస్ట్ చాలా తక్కువ. సాంకేతిక, వైద్య విద్య కోర్సులను అక్కడి స్థానిక భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా బోధన ఉండడం మరో కారణం. దీంతో పాటు కోర్సులకు సంబంధించిన ఫీజులు కూడా చాలా తక్కువగా ఉంటాయి.

Read: Mask in Delhi: కొత్త రూల్స్‌… ఇక‌పై మాస్క్ అవ‌స‌రం లేదు…

అందుకే చాలా తక్కువ వ్యయంతో ఉన్నత చదువులు పూర్తి చేసుకోవచ్చనే కారణంతో విదేశీ విద్యార్థులు ఉక్రెయిన్‌కు క్యూకడుతుంటారు. భార‌త్‌లో నిర్వ‌హించే ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించిన వారికి ఉక్రెయిన్ మెడికల్ సీటు దొరుకుతంది. అంతేకాకుండా అక్క‌డ జీవ‌న విధానం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. అందుకే విద్యార్ధులు ఉక్రెయిన్ వెళ్లేందుకు మొద‌టి ఛాయిస్‌గా ఎంచుకుంటారు. ఇక ఉక్రెయిన్‌లో చ‌దువుకునే విద్యార్థుల‌కు కోర్సును బ‌ట్టి 22 వేల నుంచి 29 వేల వ‌ర‌కు ఉంటుంది.