NTV Telugu Site icon

Cost Of Living Crisis In UK: యూకేలో జీవన వ్యయ సంక్షోభం..పెరుగుతున్న దొంగతనాలు..

Uk

Uk

Cost Of Living Crisis In UK: ఒకప్పుడు సూర్యుడు అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం సంభవించే ఛాన్స్ ఉన్న దేశాల్లో యూకే ముందు వరసలో ఉంది. ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు, కోవిడ్ మహమ్మారి, ఇంధన సంక్షోభం ఇలా అన్నీ కలిసి యూకే ఆర్థిక పరిస్థితిని దిగజార్చాయి. ఇప్పుడు యూకేలో చాలా మంది జీవన వ్యయ సంక్షోభాన్ని( Cost Of Living Crisis ) ఎదుర్కొంటున్నారు. దీంతో కొంత మంది దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా ఓ సర్వే తేల్చింది.

గత రెండేళ్లుగా యూకే వ్యాప్తంగా ప్రాథమిక అవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. వచ్చే జీతం కన్నా నిత్యావసరాలపై పెట్టే ఖర్చు అధికంగా ఉంటోంది. కొన్ని కుటుంబాలు తాము తినకుండా డబ్బును ఆదా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ పౌరులు జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కొంటు8న్నారు. దీంతో గృహాల అవసరాలను తీర్చడానికి కష్టపడుతున్నారు. 2021-2022 మధ్య యూకే అంతటా జీవన వ్యయం బాగా పెరిగింది.

Read Also: Maoist Sympathizers: మావోయిస్టులకు సహకరిస్తున్న నలుగురు బీడీ కాంట్రాక్టర్లు అరెస్ట్

దీంతో యూకే వ్యాప్తంగా దొంగతనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నిత్యవసరాలు కొంటున్న సమయాల్లో రిటైల్ షాపుల నుంచి వస్తువులను దొంగిలించడం పెరిగిందని మెట్రో సర్వేలో తేలింది. 10 యువకుల్లో ఒకరు ఇలా షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నారని తెలిపింది. ప్రస్తుతం యూకేలో ద్రవ్యోల్భణం రెండంకెల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ ద్రవ్యోల్భణం 10.4 శాతంగా ఉంది. ఆహార పదార్థాలు, ఇంధన ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. ఆల్కాహాల్, బెవరేజెస్ ధరలు 19.1 శాతం పెరిగాయి.

దొంగతనాల్లో పాలు, చీజ్ వంటివి ఎక్కువగా ఉంటున్నాయని తేలింది. ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాలు సెప్టెంబరుతో ముగిసిన సంవత్సరంలో షాపుల దొంగతనాలు 22 శాతం పెరిగాయని గతేడాది 7.9 మిలియన్ కేసులు రికార్డ్ అయినట్లు తెలిపింది. దొంగతనాల వల్ల బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థపై 660 మిలియన్ పౌండ్ల ప్రభావం పడింది.