Site icon NTV Telugu

సింగపూర్‌లో కలకలం రేపుతున్న కరోనా

singapore corona updates

యావత్తు ప్రపంచాన్ని కరోనా అతలాకుతలం చేసింది. కోవిడ్‌ కారణంగా ఎంతోమంది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. దీంతో దేశాలు కోవిడ్‌ నివారణకు వ్యాక్సిన్‌ కనుగోన్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో వారివారి వ్యాక్సిన్‌లు ఉత్తమ ఫలితాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ కరోనా మరోసారి విజృంభించింది. రోజురోజుకు అక్కడ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.

84 శాతం ప్రజలకు 2 డోసులు పూర్తైనప్పటికీ కరోనా ప్రభావం తగ్గడం లేదు. దీంతో సింగపూర్‌ ప్రభుత్వం బూస్టర్‌ డోసులను కూడా ప్రజలకు పంపిణీ చేస్తోంది. బూస్టర్‌ డోసులు కూడా 14శాతం ప్రజలు వేయించుకున్నారు. తాజాగా సింగపూర్‌లో 4వేల కరోనా కేసులు రాగా ఇప్పటికే 380 మంది కరోనా బారినపడి మృతి చెందారు.

Exit mobile version