Site icon NTV Telugu

Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై కాల్పులు..

Colambia

Colambia

Colombia: కొంలబియా సెనేటర్‌, అధ్యక్ష అభ్యర్థి మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బేపై కాల్పులు జరిగాయి. ఓ ర్యాలీలో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు. అయితే, అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం బొగోటా పార్కులో ఓ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మిగ్యుల్‌ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తుండగా.. ఓ దుండగుడు ఆయన వెనక నుంచి ఒక్కసారిగా కాల్పులకు దిగాడు.

Read Also: Nampally Exhibition Grounds: చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం.. చేప మందు కోసం వచ్చిన ఆస్తమా బాధితులు

దీంతో, అధికారులు వెంటనే అప్రమత్తమై మిగ్యుల్‌ ఉరిబ్‌ టర్బేను స్థానిక ఆస్పత్రికి తరలించారు. బొగోటా మేయర్‌ కార్లోస్‌ గాలన్‌ ఈ విషయన్ని అధికారికంగా ధ్రువీకరించారు. కాల్పులు జరిపినట్లు అనుమానిస్తున్న ఓ వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ ఘటనను మిగ్యుల్‌ పార్టీ కన్జర్వేటివ్‌ డెమోక్రటిక్‌ తీవ్రంగా ఖండించింది. ఇది ఒక రాజకీయ నాయకుడిపై జరిగిన దాడి కాదు.. దేశంలోని ప్రజాస్వామ్యం, స్వేచ్ఛపై జరిగిన దాడిగా పేర్కొన్నారు.

Exit mobile version