NTV Telugu Site icon

వైర‌ల్ః మార్స్ ను క‌మ్మేసిన మేఘాలు…

గ‌తేడాది మార్స్ మీద‌కు నాసా రోవ‌ర్‌ను పంపిన సంగ‌తి తెలిసిందే.  ఈ సాసా రోవ‌ర్ మార్స్ మీద వాతావ‌ర‌ణంపై ప‌రిశోధ‌న చేస్తున్న‌ది. ఇప్ప‌టికే మార్స్ కు సంబందించిన కొన్ని ఫొటోల‌ను రోవ‌ర్‌లోని క్యూరియాసిటీ కెమేరాలు ఫొటోలుగా తీసి భూమిమీద‌కు పంపాయి.  తాజాగా, మ‌రో ఫొటోను కూడా భూమి మీద‌కు పంపింది.  అందులో మార్స్ పైన‌ ఆకాశం మేఘాలు క‌మ్మేసి ఉన్నాయి. మార్స్ వాతావ‌ర‌ణం పొడిగా ఉంటుంది.  మేఘాలు క‌మ్మేయ‌డం చాలా అరుదుగా క‌నిపించే అంశం.  సూర్యుడు మార్స్ కు మ‌రింత దూరంగా ఉన్న‌ప్పుడు, వాతావ‌ర‌ణం చ‌ల్ల‌గా ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ఇలాంటి అరుదైన అద్బుతాలు జ‌రుగుతుంటాయ‌ని నాసా శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.  దీనికి సంబందించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.