NTV Telugu Site icon

Chinese Rocket: తప్పిన గండం.. హిందూ మహాసముద్రంలో కూలిన చైనా రాకెట్

China Rocket

China Rocket

Chinese rocket reenters atmosphere over Indian Ocean: ప్రపంచాన్ని కలవరపెడుతున్న చైనా రాకెట్ ఎలాంటి నియంత్రణ లేకుండా హిందూ మహాసముద్రంలో కూలిపోయినట్లు యూఎస్ఏ ధ్రువీకరించింది. తూర్పు కాలమాన ప్రకారం శనివారం మధ్యాహ్నం 12.45 గంటలకు చైనా రాకెట్ భూ వాతావరణంలోకి ప్రవేశించినట్లు యూఎస్ స్పెస్ కమాండ్ శనివారం వెల్లడించింది. చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5 బీ(సీజెడ్-5బీ) రాకెట్ అనియంత్రితంగా సముద్రంలో కూలిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది.

దాదాపుగా 23 టన్నుల లాంగ్ మార్చ్ – 5బీ రాకెట్ ను జూలై 24న వెన్ చాంగ్ స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి ప్రయోగించింది. చైనా తన సొంత అంతరిక్ష కేంద్రం టియాంగాంగ్ ను నిర్మిస్తోంది. అయితే ఈ అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఈ ఏడాదిలో పూర్తి చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని మాడ్యుళ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లింది చైనా రాకెట్. ఇదిలా ఉంటే రాకెట్ నుంచి బూస్టర్ విడిపోయిన సందర్భంలో అది సరైన విధంగా భూమి వాతావరణంలోకి రాలేదు. దీంతో సమస్య మొదలైంది. తాజాగా ఈ రాకెట్ బూస్టర్ హిందూ మహాసముద్రంలో కూలిపోవడంతో గండం గట్టెక్కింది.

Read Also: Iraq Protest: ఇరాక్ పార్లమెంట్‌లోకి దూసుకొచ్చి.. ప్రధాని అభ్యర్థిత్వంపై నిరసనకారుల ఆగ్రహం

హిందూ మహాసముద్రంలోని బోర్నియో ద్వీపం, ఫలిప్పీన్స్ మధ్య ప్రాంతంలో భూవాతావరణంలోకి వచ్చిన రాకెట్ రీఎంట్రీ సమయంలో శిథిలాలుగా విడిపోయి కాలిపోయింది. లాంగ్ మార్చ్ 5బీ చైనా అతిపెద్ద అంతరిక్ష రాకెట్. ఇదిలా ఉంటే చైనా గతంలో కూడా రెండు సార్లు రాకెట్ బూస్టర్ల రీఎంట్రీని సక్రమంగా చేయలేదు. దీంతో అవి అనియంత్రితంగా భూ వాతావరణంలోకి వచ్చాయి.

Show comments