NTV Telugu Site icon

ముందుకు కదిలిన చైనా రోవర్… కీలక విషయాల కోసం అన్వేషణ… 

అరుణ గ్రహం పై అడుగిడిన రెండో దేశం చైనా. తియాన్ వెన్ 1 అనే వ్యోమనౌకను గతేడాది చైనా ప్రయోగించింది.  ఈ నౌక ఇటీవలే అరుణగ్రహంలోని ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.  ఉపగ్రహంలో ఉన్న ఝురాంగ్ రోవర్ శనివారం రోజున ల్యాండర్ నుంచి కిందకు దిగింది.  మార్స్ మీద అడుగుపెట్టిన ఆరు చక్రాలతో కూడిన రోవర్ ఫోటోను భూమి మీదకు పంపించి.  హైరెజల్యూషన్ 3డి కెమెరాల సహాయంతో ఫోటోలను తీసింది.  ఈ రోవర్ గంటకు 200 మీటర్ల మేర ప్రయాణం చేస్తున్నది.  వాతావరణం, ఉపరితలం, ఉపరితలం దిగువ భాగంలో కూడా పరిశోధనలు చేసే విధంగా ఈ రోవర్ ను తయారు చేశారు.  ఇక మార్స్ గ్రహంలో అధికంగా ఇసుక తుఫానులు వస్తుంటాయి.  వీటి వలన సూర్యకాంతికి అంతరాయం కలుగుతుంది.  సూర్యకాంతి అంతరాయం కలిగినపుడు ఆ రోవర్ నిద్రాణ స్థితిలోకి వెళ్తుంది.  ఎప్పుడైతే తిరిగి సూర్యకాంతి వస్తుందో అప్పుడు తిరిగి ఈ రోవర్ పనిచేయడం మొదలుపెడుతుంది.  మూడు నెలలపాటు ఈ రోవర్ మార్స్ పై పరిశోధనలు చేయబోతున్నది.