Site icon NTV Telugu

China: ఛీ.. పూర్తిగా దిగజారిన చైనా.. కరోనాను కప్పిపుచ్చడానికి బూతు బొమ్మలతో

China

China

China: చైనా.. రోజురోజుకు ఇంకా దిగజారి ప్రవర్తిస్తోంది. తమ ఉనికిని చాటుకోవడానికి అమాయక ప్రజలను ఎరగా వేస్తోంది. దీనికోసం ఎంతకు దిగజారింది అంటే.. సోషల్ మీడియాలో ఉద్యమాల గురించి తెలియకూడదని ఆ పేరు మీద బూతు బొమ్మలను చూపించేలా చేస్తున్నారు. అసలు విషయం ఏంటంటే.. గత మూడేళ్ళుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వైరస్ కోవిడ్. దీనికి ఆద్యం చైనా అన్న విషయం తెల్సిందే. ఎంతోమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ మహమ్మారి ఈ మధ్యనే తగ్గుముఖం పట్టింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చైనాలో మరోసారి కరోనా విజృంభించిందన్న అనుమానంతో కఠినమైన లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారట.

ఇక ఆ లాక్ డౌన్ ను భరించలేని చైనా ప్రజలు ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. తమకు ఫ్రీడమ్ కావాలంటూ ఉద్యమాలు చేపట్టారు. ఇక ఈ ఉద్యమాలు సోషల్ మీడియాలో వైరల్ కాకుండా, మీడియాలో ఎక్కడా రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతుందట. అంతేకాకుండా ఈ విషయం బయటకు పొక్కకుండా ఒక దిగజారిన నిర్ణయం తీసుకున్నారట. గూగుల్ కు వెళ్లి ఎవరైనా చైనా నిరసనలు, చైనా కోవిడ్ ఉద్యమం అని సెర్చ్ చేస్తే… ఏ ఇన్ఫర్మేషన్ రాకుండా ఆ ప్లేస్ లో బూతు బొమ్మలను వచ్చేలా ఫిక్స్ చేశారట. మోడల్స్, అసభ్యకరమైన వెబ్ సైట్లు ఓపెన్ అవుతున్నాయట. అంతే అక్కుండా సోషల్ మీడియాలో నిరసన, బీజింగ్, అల్లర్లు అనే పదాలు రాకుండా వాటిని బ్లాక్ చేశారట. ఇక మరింత ఎదురుతిరిగిన యువకులను ఆ కేసులు, ఈ కేసులు పెట్టి వారిని జైల్లో పెడుతున్నారట. మరి చైనా ఆగడాలు ఎక్కడివరకు వెళ్లి ఆగుతాయో చూడాలి.

Exit mobile version