NTV Telugu Site icon

Degree in marriage: పెళ్లిపై డిగ్రీ ప్రవేశపెట్టిన చైనా యూనివర్సిటీ..

China

China

Degree in marriage: చైనాలో రోజురోజుకి జననాల సంఖ్య తగ్గుతోంది. అక్కడి యువత పెళ్లిళ్లపై మొగ్గు చూపకపోవడం, పిల్లల్ని కనాలనే ఇంట్రస్ట్ లేకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది. అయితే, యువత పెళ్లిళ్ల వైపు దృష్టిసారించేలా అక్కడి ప్రభుత్వం అనేక ప్రోత్సహకాలను కూడా ప్రకటించింది. ఇదిలా ఉంటే చైనాలోని ఓ యూనివర్సిటీ వివాహాలపై ఏకంగా ఓ డిగ్రీ కోర్సునే తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. వివాహ-సంబంధిత పరిశ్రమలు మరియు సంస్కృతిని అభివృద్ధి చేయడానికి చైనా సివిల్ ఎఫైర్స్ యూనివర్సిటీ ఒక కొత్త అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుని ప్రవేశపెట్టింది.

సెప్టెంబర్ నెల నుంచి ఈ కోర్సు ప్రారంభం కానున్నందున, వివాహ సంబంధిత పరిశ్రమను అభివృద్ధి చేయడానికి నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు అక్కడి మీడియా నివేదించింది. 2023లో చైనా జనాభా పరంగా వరసగా రెండో ఏడాది కూడా కొత్త జననాల సంఖ్య పడిపోయింది. వివాహాల రేటులో జననాల సంఖ్యకు సంబంధం ఉండటంతో అక్కడి ప్రభుత్వ యువతీయువకులు పెళ్లిళ్లు చేసుకునేలా ప్రోత్సహిస్తోంది.

Read Also: Vietnam: భారతీయ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌లోకి బతికి ఉన్న ఈల్.. కడుపులో పేగుల్ని తీనేసింది..

మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్‌మెంట్ అని పిలవబడే, కొత్త డిగ్రీ వివాహాలపై దాని అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెడుతుంది. చైనాలో వివాహాలు, కుటుంబ సంస్కృతిని విద్యార్థులకు, ప్రజలకు తెలియజేయడం, చైనా వివాహ ఆచారాల సంస్కరణల్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు గ్లోబల్ టైమ్స్ తెలిపింది.

అయితే, ఈ నిర్ణయంపై చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ విబోలో యూజర్లు సెటైర్లు వేస్తున్నారు. ఇది ప్రభుత్వ యాజమాన్యంలోని వివాహ ఏజెన్సీని ప్రారంభించిందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇలాంటి డిగ్రీలు అవసరమా అని ప్రశ్నించారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం కూడా యువత పెళ్లిళ్ల వైపు మొగ్గు చూపకపోవడానికి కారణంగా కనిపిస్తోంది.

Show comments