వియాత్నం విషయంలో చైనా ఏమాత్రం పట్టు వదలడం లేదు. తైవాన్ తమ ఆదీనంలోనే ఉందని ఇప్పటికీ స్పష్టం చేస్తున్నది. తైవాన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. అయితే, కొన్ని రోజుల క్రితం జపాన్ ఉప ప్రధాని తారో అసో తైవాన్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బయటి శక్తులు తైవాన్ పై ఆదిపత్యం చలాయించాలని చూస్తే ఊరుకోబోమని, అండగా ఉంటామని తైవాన్‌కు హామీ ఇచ్చారు.
Read: అశ్లీల చిత్రాల కేసు: శిల్పా శెట్టి భర్తను విచారిస్తున్న పోలీసులు
జపాన్ వ్యాఖ్యల తరువాత చైనా ఘాటుగా స్పందించింది. తైవాన్ విషయంలో జపాన్ జోక్యం చేసుకుంటే బాంబులు వేస్తామని, ఒక్క సైనికుడు గాని, ఒక్క యుద్ధ విమానంగాని తైవాన్ సరిహద్దుల్లోకి వస్తే అణుయుద్ధం తప్పదని, జపాన్ ను నామరూపాలు లేకుండా చేస్తామని చైనా హెచ్చరించింది. దీనికి సంబందించి ఇటీవలే చైనా అధికారిక ఛానల్‌లో ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఆ తరువాత వీడియోను ఆ ఛానల్ డిలీట్ చేసింది.
