చైనా-తైవాన్ వ్యవహారం సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది.. తైవాన్ కూడా చైనాలో భాగమే. అది కచ్చితంగా మళ్లీ చైనాలో కలిసి తీరుతుంది. తైవాన్ ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకొని తీరాల్సిందే.. లేని పక్షంలో సైనిక బలగాలను ఉపయోగించేందుకూ వెనకాడం అంటూ గతంలోనే హెచ్చరించారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్… ఇక, తాజాగా మరోసారి ఈ వ్యహారం తెరపైకి వచ్చింది.. ఈ వివాదంలో అమెరికా కూడా జోక్యం చేసుకుంటాం అంటోంది.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేసింది చైనా.. తైవాన్ తమ భూభాగమని అవసరమైతే బలవంతంగా స్వాధీనం చేసుకుంటామని ప్రకటించింది.
Read Also: చిన్నారులకు కోవాగ్జిన్..! అమెరికాలో దరఖాస్తు..
అంతేకాదు.. తైవాన్ రాజకీయ నేతలు, స్వాతంత్య్రాన్ని కాంక్షించే వారిని శిక్షిస్తామంటూ హెచ్చరించింది చైనా.. బీజింగ్, తైపీల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమైన నేపథ్యంలో చైనా ఈ వ్యాఖ్యలు చేసింది.. తైవాన్ స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న వారిపై చట్టాలకు అనుగుణంగా చైనా చర్యలు చేపడుతుందని బీజింగ్‌లోని తైవాన్ వ్యవహారాల కార్యాలయం హెచ్చరించింది. మరోవైపు.. తైవాన్ ప్రధాని సు సెంగ్-చాంగ్, పార్లమెంట్ స్పీకర్ యూషి కున్, విదేశాంగ మంత్రి జోసెఫ్ వూ తదితరులు స్వతంత్ర ఉద్యమకారులకు మద్ధతిస్తున్నారని తైవాన్ వ్యవహారాల కార్యాలయం ప్రతినిధి ఝౌ ఫెంగ్లియన్ అన్నారు. తైవాన్ రాజకీయ నేతలు చైనాతో ఘర్షణలకు కాలుదువ్వుతూ బీజింగ్ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, గతంలోనూ అవసరం అయితే బలవంతంగానైనా తైవాన్‌ను స్వాధీనం చేసుకుంటామంటూ చైనా హెచ్చరించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆసక్తికరంగా మారింది.
