Site icon NTV Telugu

China-Taiwan Issue: తైవాన్ గగనతలంలోకి 27 చైనా యుద్ధవిమానాలు.. అగ్గి రాజేసిన నాన్సీ పెలోసీ పర్యటన

Nancy Pelosi

Nancy Pelosi

China,Taiwan Issue – 27 Chinese warplanes enter Taiwan’s air defence zone: స్వయం పాలిత తైవాన్ ద్వీపాన్ని చేజిక్కించుకునే ఆలోచనలో డ్రాగన్ కంట్రీ చైనా ఉన్నట్లుగా తెలుస్తోంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శనను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వన్ చైనా విధానాన్ని అమెరికా దిక్కరిస్తోందని చైనా తన ఆక్రోషాన్ని వెల్లగక్కుతోంది. నిప్పుతో చెలగాటమాడుతున్నారని.. అమెరికాను హెచ్చరించింది. అయితే చైనా బెదిరింపులను లెక్క చేయకుండా నాన్సీ పెలోసీ మంగళవారం రాత్రి తైవాన్ ను సందర్శించారు. ఇదిలా ఉంటే తైవాన్ ను భయపెట్టేలా మరోసారి కయ్యానికి కాలుదువ్వింది చైనా. ఏకంగా పీపుల్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 27 యుద్ద విమానాలు బుధవారం తైవాన్ వైమానికి రక్షణ జోన్ లోకి వెళ్లాయి. ఈ విషయాన్ని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. మొత్తం 27 విమానాల్లో 16 ఎస్ యూ-30 రకానికి చెందిన విమానాలు ఉండగా.. జెఫ్-16 విమానాలు ఐదు, జేఎఫ్ -11 విమానాలు ఆరు ఉన్నట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది.

Read Also: Srilanka Economic Crisis: మోదీ నాయకత్వంలోని భారత్ మాకు ప్రాణం పోసింది.. శ్రీలంక అధ్యక్షుడి కృతజ్ఞతలు

ఇదిలా ఉంటే నాన్సీ పెలోసికి తైవాన్ ఘన స్వాగతం పలికింది. 25 ఏళ్ల తరువాత తైవాన్ ను సందర్శించిన మొదటి స్పీకర్ గా నాన్సీ పెలోసీ నిలిచారు. తైవాన్ పై అమెరికా నిర్ణయాన్ని మరోసారి గట్టిగా వెల్లడించినట్లు అయింది. ఇదిలా ఉంటే అమెరికా చర్య పట్ల చైనా ఆగ్రహంగా ఉంది. ప్రస్తుతానికి తైవాన్ పై చైానా కొన్ని ఆంక్షలు విధించింది. రానున్న కాలంలో చైనా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అయితే నాన్సీ పెలోసి పర్యటనను డ్రాగన్ మిత్ర దేశం పాకిస్తాన్ వ్యతిరేకించింది. ఈ చర్య ఆసియాలో శాంతికి విఘాతం కలిగిస్తుందని పాక్ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటు రష్యా నాన్సీ పెలోసి పర్యటన తక్కువగా చూడద్దని.. ఉద్రిక్తతలు పెంచేదిగా ఉందంటూ వ్యాఖ్యానించింది.

Exit mobile version