Site icon NTV Telugu

China: అలాంటి డ్రెస్సులు వేసుకుంటే జైలుకే.. కొత్త చట్టం చేస్తున్న చైనా

China

China

China: డ్రాగన్ కంట్రీలో చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ముఖ్యంగా మానవహక్కులకు పెద్దగా ప్రాధాన్యత ఉండదు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం చేసిందే చట్టం, చెప్పందే వేదం. దేశాన్ని విమర్శించినా, కమ్యూనిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన ప్రజలు మాయమవుతుంటారు. లేకపోతే జైళ్లలోకి వెళ్తుంటారు. అలాంటి చైనా కొత్తగా మరో చట్టాన్ని తీసుకురాబోతోంది.

దేశ మనోభావాలనున దెబ్బతీసే దస్తులను నిషేధించేందుకు చట్టాన్ని చైనా సిద్ధం చేసింది. చైనా ప్రజల స్పూర్తికి హానికరంగా భావించే దుస్తులను నిషేధించే చట్టాన్ని చైనా పరిశీలిస్తోంది. ఇప్పటికే ఈ చట్టానికి సంబంధించిన ముసాయిదా ఖరారైంది. చట్టం ప్రకారం ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే రూ. 79,002 జరిమానా నుంచి 15 రోజలు పాటు నిర్భంధ కేంద్రాలకు పంపించే అవకాశం ఉంది. అయితే ఎటువంటి దుస్తులను బ్యాన్ చేస్తారనే విషయాలను అక్కడి ప్రభుత్వం ప్రకటించలేదు.

Read Also: Kodali Nani: చంద్రబాబును అరెస్ట్‌ చేయక ముద్దు పెట్టుకుంటారా?

నివేదికల ప్రకారం.. జపనీస్ దుస్తులతో పాటు కిమోనో ధరించిన మహిళను గతేడాది సుజౌ నగరంలో అరెస్ట్ చేశారు. స్వలింగ సంపర్కుల చిహ్నంగా భావించే రెయిన్ బో ఉన్న చొక్కాలు ధరించి LGBTQ+ అనుకూలంగా ఉన్న జెండాలు పంపిణీ చేస్తునన వ్యక్తులపై చర్యలు తీసుకుంది అక్కడి ప్రభుత్వం. 2019లో హాకాంగ్ లో ప్రజాస్వామ్య అనుకూల నిరసనల సందర్భంగా నల్ల దుస్తులను ఎగుమతి చేయడాన్ని చైనా నిషేధించింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం ఆపిల్ ఐఫోన్, ఇతర విదేశీ బ్రాండ్ల మొబైళ్లను ఆఫీసుల్లోకి తీసుకురావద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Exit mobile version