Site icon NTV Telugu

ప్రశ్నించడమే పాపం: చావు బతుకుల్లో చైనా జర్నలిస్ట్‌

చైనా చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై ఉక్కు పాదం మోపుతుం ది. కరోనా వచ్చిన కొత్తలో వుహాన్‌ నగరంలోని పరిస్థితులను ప్రశ్నిం చిన జర్నలిస్ట్‌ పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. ప్రస్తుతం ఆమె చావు బతుకుల్లో కొట్టు మిట్టాడుతున్నారు. చైనాకు చెందిన ఝాంగ్‌ జాన్‌(38) ఓ జర్నలిస్ట్‌ అంతక ముందు ఆమె న్యాయవాదిగా పని చేశారు. 2020లో వుహాన్ నగరంలోని వాస్తవ పరిస్థితులను ప్రపంచా నికి తెలియజేసినందుకు, వార్తలు రాసినందుకు ఆమెను జిన్‌పింగ్‌ ప్రభుత్వం జైల్లోపెట్టింది. రెచ్చగొట్టే చర్యల ద్వారా ఇబ్బందులు సృష్టిస్తున్నారనే ఆరోపణలతో ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను విధించారు.

ప్రస్తుతం ఝాంగ్ జాన్ ఆరోగ్యం బాగాలేదని, ఎక్కువకాలం బతకదని, ఇక విడిచి పెట్టాలని ఆమె కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. అక్కడి మానవహక్కుల సంఘాలు సైతం ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సైతం చైనా ప్రభుత్వానికి అభ్యర్థన చేసింది. ఆమె ప్రస్తుతం నిరాహార దీక్ష చేస్తుం దని, ఝాంగ్‌జాన్‌కు వైద్యం చాలా అవసరమని ఆమ్నెస్టీ తెలి పింది. కనీసం ఆమె కుటుంబ సభ్యులను కూడా కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదని అక్కడి హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

Exit mobile version