China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China halts J10CE Delivery: భారత వైమానిక దళానికి చెందిన శక్తివంతమైన ‘రఫేల్’ యుద్ధ విమానాలను ఢీకొట్టేందుకు చైనా నుంచి అత్యాధునిక యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనుకున్న పాకిస్థాన్ ఆశలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది దేశానికి చైనా ఊహించని షాక్ ఇచ్చింది. తాము ఇవ్వాల్సిన మిగిలిన 16 జె-10సిఇ (J-10CE) యుద్ధ విమానాల డెలివరీని చైనా తాత్కాలికంగా నిలిపివేసింది. పాక్ సకాలంలో డబ్బులు చెల్లించకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
రఫేల్‌కు పోటీగా ‘డ్రాగన్’తో ఒప్పందం..
భారత వైమానిక దళంలోని రఫేల్ విమానాల సామర్థ్యాన్ని తట్టుకునేందుకు పాకిస్థాన్ వైమానిక దళం (PAF) చైనాతో ఒక భారీ రక్షణ ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం చైనా నుంచి మొత్తం 36 అత్యాధునిక జె-10సిఇ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. సాంకేతికంగా రఫేల్, జె-10సిఇ విమానాల సామర్థ్యాల్లో ఎంతో వ్యత్యాసం ఉన్నప్పటికీ.. చైనా మాత్రం ఈ విమానాలను రఫేల్‌కు సరైన ప్రత్యర్థిగా ప్రచారం చేసుకుంది. అయితే ఈ ఒప్పందంలో భాగంగా పాక్ ఇప్పటి వరకు 20 జె-10సిఇ విమానాలను అందుకుంది. చైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చిన రుణాల సహాయంతోనే ఈ మొదటి విడత సరఫరా సాధ్యమైనట్లు సమాచారం. అయితే ఒప్పందం ప్రకారం మిగిలిన 16 విమానాలను డెలివరీ చేయడానికి ముందే పాకిస్థాన్ నిర్దేశిత వాయిదాలను చైనాకు చెల్లించాల్సి ఉంది.
Also Read
డబ్బుల్లేవ్.. డెలివరీ బంద్
ప్రస్తుతం పాకిస్థాన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) అడుగుంటడం, అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) కఠినమైన షరతులు విధించడం, పెరుగుతున్న రుణాల భారం వల్ల పాక్ సకాలంలో చైనాకు చెల్లింపులు చేయలేకపోయింది. దీంతో తమకు అత్యంత ఆప్తుడైన ‘ఐరన్ బ్రదర్’ అని చెప్పుకునే చైనా.. నిధులు అందే వరకు మిగిలిన 16 యుద్ధ విమానాల సరఫరాను నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. చైనా తీసుకున్న ఈ నిర్ణయం పాకిస్థాన్ వైమానిక దళానికి కోలుకోలేని దెబ్బగా మారిందని నిపుణులు చెబుతున్నారు. జె-10సిఇ విమానాలతో పూర్తి స్థాయి స్క్వాడ్రన్లను మోహరించి, భారత్ సరిహద్దుల్లో వాయు శక్తిని పెంచుకోవాలనే పాక్ వ్యూహం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దక్షిణాసియాలో రక్షణ రంగ పోటీ పెరుగుతున్న తరుణంలో ఈ జాప్యం పాక్‌కు పెద్ద మైనస్‌గా మారనుందని అంటున్నారు.
జె-35 స్టెల్త్ ఫైటర్ కలలు కల్లేనా
మరోవైపు చైనాకు చెందిన ఐదవ తరం అత్యాధునిక ‘జె-35 స్టెల్త్ ఫైటర్’ (J-35 Stealth Fighter) విమానాలను కూడా కొనుగోలు చేయాలని పాకిస్థాన్ గత కొన్ని నెలలుగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న 4.5 తరం జె-10సిఇ విమానాలకే డబ్బులు కట్టలేక చేతులెత్తేసిన పాకిస్థాన్.. ఇక అంతకంటే ఖరీదైన స్టెల్త్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తుందనేది ఇప్పుడు అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణుల ముందున్న పెద్ద ప్రశ్న.
జె-10సిఇ ప్రత్యేకతలు ఇవే..
ఇది చైనాకు చెందిన ఆధునిక 4.5-తరం (4.5-Generation) యుద్ధ విమానం.
ఇందులో అధునాతన AESA రాడార్ – ఆధునిక ఏవియానిక్స్ వ్యవస్థలు ఉన్నాయి.
సుదూర లక్ష్యాలను ఛేదించే పీఎల్-15 (PL-15) గగనతల క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 13 ఆదివారం దినఫలాలు.. ఏ రాశివారికి ఎలా ఉందంటే..!
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!