China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- చైనాను ముంచెత్తిన భారీ వరదలు
- కొట్టుకుపోయిన కార్లు
- వీడియోలు వైరల్
భారతదేశంలో ఎండలు మండిపోతుంటే.. చైనాలో మాత్రం వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు కారణంగా చైనాలో వరదలు ముంచెత్తాయి. చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌లోని క్విన్‌జౌలో ఎనిమిది గంటల్లో 273 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రోడ్లు, వాహనాలు జలమయమయ్యాయి.
సోమవారం కేవలం ఎనిమిది గంటల్లో 273 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని… అందులో ఒకే గంటలో 160 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదేనని చెప్పారు. రహదారులన్నీ జలమయం కావడంతో పాఠశాలలు, కాలేజీలు మూసేశారు. ఇక సహాయ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టారు.
Also Read
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Nigeria: నైజీరియాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. ఫుట్‌బాల్ మైదానంలో కాల్పులు.. 29 మంది మృతి
- Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
- Trump-King Charles: వైట్‌హౌస్‌లో ట్రంప్‌ను కలిసిన కింగ్ చార్లెస్ దంపతులు
తీవ్రమైన వేడి కారణంగా వాతావరణంలో తేమ ఏర్పడడంతో భారీ వర్షపాతానికి ప్రధాన కారణం అని అధికారులు చెబుతున్నారు. తేమ అకస్మాత్తుగా వర్షం రూపంలోకి మారడంతోనే ఇలా సంభవించిందని పేర్కొన్నారు. హిందూ మహాసముద్రం వేగంగా వేడెక్కడం కూడా దక్షిణ చైనాలో తేమను వర్షపాతంగా మార్చినట్లు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే భారతదేశంలో మాత్రం ఎండలు మండిపోతున్నాయి. ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఉదయం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. ఇక మధ్యాహ్నం అయితే భానుడు భగభగ మండిపతున్నాడు. ఉక్కపోత, చెమటతో ప్రజలు అల్లాడిపోతున్నారు. కానీ పొరుగున ఉన్న దేశంలో మాత్రం వరదలు బెంబేలెత్తిస్తున్నాయి.
Qinzhou, Guangxi, China is experiencing extreme rainfall that has caused flooding today.
273 mm in 8 hours, three times the extreme storm threshold.
160 mm in 1 hour, nearing world-record intensity.
Previous April records for the region have been broken. pic.twitter.com/7lel2xRWSE— Weather Monitor (@WeatherMonitors) April 27, 2026
తాజావార్తలు
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
-
Telangana SSC 10th Results: పది ఫలితాలపై బిగ్ అప్డేట్.. రిజల్ట్స్ డేట్ ఫిక్స్..
-
CM Chandrababu: ఏపీ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు.. గూగుల్ రాక గేమ్ ఛేంజర్..
-
WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్‌లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
-
UIDAI Important Update: యూఐడీఏఐ కీలక నిర్ణయం.. ఇక వీటికి ఆధార్ చెల్లదు..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!