చైనా హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడ్డారు.. ఇజ్రాయెల్‌పై గురిపెట్టిన చైనా హ్యాకర్లు.. ఆ దేశానికి చెందిన వివిధ ప్రభుత్వ సంస్థలు, ఐటీ, టెలికాం కంపెనీలను సంబంధించిన డాటాను చోరీ చేశారు.. ఈ విషయాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ కంపెనీ ‘ఫస్ట్ ఐ’ వెల్లడించింది. పలు కంపెనీల ఫైనాన్స్, టెక్నాలజీ, వ్యాపారానికి సంబంధించిన డాటాను హ్యాకర్లు దొంగిలించారని పేర్కొంది.. ఆ డాటాలో యూజర్ డాటా కూడా ఉన్నట్టుగా భావిస్తున్నారు…
ఫస్ట్ ఐ పేర్కొన్న ప్రకారం.. డ్రాగన్ కంట్రీకి చెందిన సైబర్ గ్రూప్ యూఎన్‌సీ 215 ఈ దాడికి పాల్పడింది. మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్‌లోని పాత లూప్ హోల్‌ను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు.. రెండు మాల్‌వేర్‌లను వాడారు. అంతేకాదు.. ఈ దాడికి ఇరాన్ దే బాధ్యత అని నెపం మోపేందుకు కూడా ప్రయత్నాలు చేశారు హ్యాకర్లు. సైబర్ ఎటాక్, డాటా చోరీపై ఇజ్రాయెల్ దర్యాప్తు చేస్తుందని భావించిన హ్యాకర్లు.. ఇరాన్‌పై అనుమానం వచ్చేలా చేసేందుకు సాక్ష్యాలను వదిలిపెట్టారు. ఇరాన్‌లో సాధారణంగా హ్యాకర్లు ఉపయోగించే టూల్స్‌ను ఇక్కడ ఈ హ్యాకర్లు ఉపయోగించినట్టుగా చెబుతున్నారు. ఇజ్రాయెల్‌ను టార్గెట్‌గా చేసుకుని చైనా చేసిన అతిపెద్ద సైబర్ ఎటాక్ ఇదే అని తెలుస్తోంది.
