Site icon NTV Telugu

ఒక్క‌రోజులో 10 అంత‌స్థుల భ‌వ‌నం నిర్మాణం… ఎలా అంటే…

ఇంటిని నిర్మాణం చేయాలంటే క‌నీసం నెల రోజుల స‌మ‌యం ప‌డుతుంది. టెక్నాల‌జీని వినియోగించుకొని, భ‌వ‌నాన్ని నిర్మించినా, క‌నీసం నాలుగైదు రోజుల స‌మ‌యం పడుతుంది. 10 అంత‌స్థుల భ‌వ‌నాన్ని ఒక్క‌రోజులో నిర్మించడం అంటే మాములు విష‌యం కాదు.  చాలా క‌ష్ట‌మైన విష‌యంగా చెప్పాలి. మౌలిక స‌దుపాయాల విష‌యంలో ముందున్న చైనా, 10 అంత‌స్థుల భ‌వ‌నాన్ని ఒకే ఒక్క‌రోజులోనే నిర్మించింది.  

Read: సీఎం జగన్ కు 15 ఏళ్ల బాలిక లేఖ…

బ్రాడ్‌గ్రూప్ కంపెనీ చైనాలోని చాంగ్సా ప్రాంతంలో 10 అంత‌స్థుల భ‌వ‌నాన్ని కేవ‌లం 28గంట‌ల 45 నిమిషాల వ్య‌వ‌ధిలోనే నిర్మించి రికార్ఢ్ సృష్టించింది.  ప్రీ ఫ్యాబ్రికేష‌న్ విధానంలో ఈ భ‌వ‌నాన్ని నిర్మించింది.  కంపెనీలోనే ఒక‌చోట భ‌వ‌నాల‌కు సంబందించిన విడిభాగాల‌ను త‌యారు చేసుకొని, వాటిని ఒక‌చోట చేర్చి ఈ నిర్మాణాన్ని చేప‌ట్టింది.  2015 లోఇదే టెక్నాల‌జీతో 59 అంత‌స్థుల భ‌వ‌నాన్ని 19 రోజు్లోనే నిర్మించి రికార్ఢ్ సృష్టించింది బ్రాడ్ గ్రూప్‌. 

Exit mobile version