China: పాకిస్తాన్ మిత్రదేశం చైనా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. గత కొన్ని రోజులుగా చైనాలో జనాభా తగ్గదల కనిస్తోంది. ముఖ్యంగా, పెళ్లిళ్లు చేసుకోవడానికి, పిల్లల్ని కనడానికి చైనా యువత ఆసక్తి చూపించడం లేదు. దీంతో జననాల రేటు పడిపోతోంది. ప్రస్తుతం, చాలా దేశాలు జనాభాను తమ వ్యూహాత్మక ఆస్తిగా పరిగణిస్తున్నాయి. చాలా దేశాల్లో యవ జనభా తగ్గిపోయి, వృద్ధ జనాభా పెరుగుతోంది. దీంతో ఇది ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు, ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తున్నాయి.
Read Also: Wife Kills Husband: కూతురుతో కలిసి భర్తను చంపిన భార్య.. సహాయం చేసిన మరో ఇద్దరు..
బీబీసీ నివేదిక ప్రకారం, చైనా ప్రభుత్వం మూడు ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న ప్రతీ బిడ్డ తల్లిదండ్రులకు వార్షిక సబ్సిడీని ప్రకటించింది. జననాలను ప్రోత్సహించేందుకు చైనా ఈ విధానాన్ని తీసుకువచ్చింది. గత కొన్ని దశాబ్ధాల పాటు చైనా అవలంభించిన ‘‘వన్ చైల్డ్’’ పాలసీ ఇప్పుడు ఆ దేశాన్ని వృద్ధ దేశంగా మార్చింది. ప్రభుత్వం ప్రసవాలను ప్రోత్సహించడానికి సబ్సిడీలను అందిస్తోంది.
ప్రభుత్వం మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వార్షికంగా 3,600 యువాన్లు (సుమారు రూ. 41,000) సబ్సిడీని అందించే విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం జనవరి 1, 2025 నుండి అమలు చేయబడుతుంది. అదే సమయంలో, 2022, 2023 లేదా 2024లో జన్మించిన పిల్లలు ఉన్న కుటుంబాలు కూడా పాక్షిక ప్రయోజనాలకు అర్హులుగా ప్రకటించింది. సబ్సిడీ పన్ను రహితంగా ఉంటుందని చెప్పింది. కొత్త కార్యక్రమం నుంచి 20 మిలియన్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
