Site icon NTV Telugu

నేపాల్‌పై చైనా ఆగ్ర‌హం…టీకా గోప్య‌త బ‌హిర్గతం అయింద‌ని…

నేపాల్ పై చైనా ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  చైనాలో త‌యారైనా సీనోఫామ్ వ్యాక్సిన్‌ల‌ను నేపాల్‌లో వేస్తున్నారు. అయితే, వ్యాక్సిన్ విష‌యంలో రెండు దేశాల మ‌ధ్య ఓ ఒప్పందం కుదిరింది.  ఈ ఒప్పందం ప్ర‌కారం వ్యాక్సిన్ ధ‌ర‌ను బ‌హిర్గ‌తం చేయ‌కూడ‌దు. కానీ, సీనోఫామ్ వ్యాక్సిన్ టీకా ధ‌రను కొన్ని మీడియా సంస్థ‌లు బ‌హిర్గ‌తం చేయ‌డంతో చైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  ధ‌ర‌ల విష‌యం బ‌హిర్గతం కావ‌డానికి కార‌కుల‌పై చర్య‌లు తీసుకోవ‌డానికి నేపాల్ ప్ర‌భుత్వం సిద్ధం అయింది.  ఒక్కో వ్యాక్సిన్ ధ‌ర‌ను 10 డాల‌ర్ల‌గా నిర్ణ‌యించిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. గోప్య‌తా ఒప్పందం బ‌హిర్గ‌తం కావ‌డంపై చైనా ఎంబ‌సీ నేపాల్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. 

Exit mobile version