Site icon NTV Telugu

US: రెస్టారెంట్‌లో ఫుడ్ ఆరగిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్లు.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!

Us

Us

ఎప్పుడు.. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు అనడానికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. మనం బాగానే ఉన్నా.. ఎటువైపు నుంచి ముప్పు వస్తుందో అంచనా వేయడం కష్టం. ఇలాంటి సంఘటనే అమెరికాలో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఇది కూడా చదవండి: INDIA Bloc: ప్రతిపక్ష ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి.. తెలంగాణ వ్యక్తి పేరు ప్రకటించిన ఖర్గే

ఇద్దరు ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ రివ్యూ ఇస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లు నినా శాంటియాగో, తోటి కంటెంట్ సృష్టికర్త పాట్రిక్ బ్లాక్‌వుడ్‌తో కలిసి తింటూ రివ్యూ ఇస్తున్నారు. ఇద్దరూ ఆస్వాదిస్తూ తింటున్నారు. ఇంతలోనే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆగస్టు 17న హూస్టన్ రెస్టారెంట్‌లో ఈ ప్రమాదం జరిగింది.

ఇది కూడా చదవండి: Archana Tiwari: లా గ్రాడ్యుయేట్ అర్చన తివారీ అదృశ్యం.. 3 బృందాలు గాలింపు

అయితే ఈ ప్రమాదంలో ఇద్దరూ గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడదియాలో పోస్ట్ చేశారరు. కారు దూసుకురావడంతో గాజు పగిలి ముఖంపై పడ్డాయి. దీంతో ముఖంపై అనేక గాయాలు అయ్యాయి. ఇక టేబుల్ కూడా పడిపోయింది. తృటిలో ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. లేదంటే ప్రాణాలు పోయేవి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Exit mobile version