కరోనా మహమ్మారి మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదర్కొన్న చాలా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రజులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్ భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వాలు మళ్లీ లాక్‌డౌన్ అమలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. 2020 లో కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఆస్ట్రేలియాలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. కాన్‌బెర్రాలో భారీగా కేసులు బయటపడటంతో లాక్‌డౌన్ విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈరోజు నుంచి వారం రోజులపాటు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు పెద్దమొత్తంలో సరుకులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో అనేక ప్రాంతాల్లోని సూపర్ మార్కెట్ల ప్రజలు క్యూలు కడుతున్నారు.
Read: ఎన్నికల్లో డబ్బులు పంచిన మాజీ ఎమ్మెల్యేకు జైలు శిక్ష ఖరారు
