NTV Telugu Site icon

Canadian Plane: రఫ్ ల్యాండింగ్.. తృటిలో ప్రమాదం నుంచి బయటపడిన కెనడా విమానం..

Halifax Plane Crash

Halifax Plane Crash

Canadian Plane: ప్రపంచవ్యాప్తంగా వరసగా జరుగుతున్న విమాన ప్రమాదాలు విమాన ప్రయాణికుల్లో గుబులు రేపుతున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలో రెండు విమానాలు కుప్పకూలాయి. కొన్ని రోజుల క్రితం అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం బాకు నుంచి రష్యాకు వెళ్తుండగా కజకిస్తాన్‌లో కుప్పకూలింది. పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారు. తాజాగా ఆదివారం రోజు మరో డెడ్లీ విమాన ప్రమాదం జరిగింది. సౌత్ కొరియా విమానం ల్యాండింగ్ సమయంలో ల్యాండిగ్ గేర్ ఫెయిల్యూర్ కారణంగా ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 179 మరణించగా, ఇద్దరు బతికి బయటపడ్డారు.

Read Also: UP: క్లాస్‌రూంలో పోర్న్ చూస్తున్న టీచర్..పట్టుకున్న స్టూడెంట్‌పై దాడి..

ఇదిలా ఉంటే, కెనడాకు చెందిన ఓ విమానం తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. కెనడాలోని హాలిఫాక్స్ స్టాన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఈరోజు విమానంలో పాక్షికంగా మంటలు చెలరేగాయి. పీఎల్ఏ ఎయిర్‌లైన్స్‌కి చెందినన కెనడా ఎక్స్‌ప్రెస్ విమానం న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి హాలిఫాక్స్‌కి వచ్చిన సమయంలో ల్యాండింగ్ గేర్ ఫెయిల్యూర్ ఎదురైంది.

విమానం దాదాపుగా 20 డిగ్రీలు కోణంలో ఎడమవైపు ఒరిగిపోవడం ప్రారంభించింది. విమానం రెక్కలు రన్ వేని రాసుకుంటూ ల్యాండ్ అయింది. విమానం పూర్తి సామర్థ్యం 80 మంది ప్రయాణికులు, చాలా సీట్లలో ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది. ప్రమాదాన్ని ఊహించిన అధికారులు ఎయిర్‌పోర్టులో పారామెడిక్స్, అత్యవసర సేవల విభాగాలను అలర్ట్ చేశాయి. ప్రయాణికుల్ని వెంటనే విమానం నుంచి ఖాళీ చేయించారు. ల్యాండింగ్ గేర్ వైఫల్యంపై విచారణ జరుగుతోంది.

Show comments