Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Canadian Billionaire Couple Family Offers 35 Million Dollars To Nab Killer

Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా

Published Date :December 18, 2022 , 5:48 pm
By NTV WebDesk
Canadian Billionaire Couple: వీడని దంపతుల డెత్ మిస్టరీ.. హంతకుడిపై 300 కోట్లు నజరానా
  • Follow Us :
  • google news
  • dailyhunt

Canadian Billionaire Couple Family Offers 35 Million Dollars To Nab Killer: ఐదేళ్ల క్రితం తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో హత్యకు గురైన కెనడియన్ బిలియనీర్ దంపతుల డెత్ మిస్టరీ ఇంకా వీడని నేపథ్యంలో.. హంతకుడిపై అక్షరాల రూ. 300 కోట్ల నజరానా ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులు ఈ ప్రకటన ఇచ్చారు. ఎవరైతే హంతకుడ్ని పట్టిస్తారో, వాళ్లకి ఆ భారీ మొత్తం క్షణాల్లోనే ఇస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. తొలుత ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు. సంఘటనా స్థలంలో అలాంటి ఆనవాళ్లు కనిపించడం వల్ల, ఆత్మహత్యేనని ప్రాథమిక విచారణలో తేల్చారు. కానీ.. ఆ తర్వాత హత్యగా అని తేలడంలో, నిందితుడి కోసం గాలించడం మొదలుపెట్టారు. ఐదేళ్లయినా ఇంతవరకూ అతడ్ని పట్టుకోలేకపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..

Shraddha Walker Like Incident: శ్రద్ధా వాకర్ తరహాలో మరో ఘటన.. మహిళను చంపి, 50 ముక్కలు చేసి..

అది 2017 డిసెంబర్ 15వ తేదీ. ఆ రోజు డ్రగ్‌ దిగ్గజం అపోటెక్స్‌ వ్యవస్థాపకుడు బారీ షెర్మాన్‌ (75), తన భార్య హనీ (70)తో కలిసి ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. ఇంతలోనే ఓ దుండగుడు వారి ఇంట్లోకి చొరబడి, ఇద్దరినీ చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితుల్ని చూసి.. ఆ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు. కానీ.. విచారణలో మాత్రం వాళ్లు హత్యకు గురైనట్టు తేలింది. ఒకవేళ పోలీసులు వాళ్లది ఆత్మహత్య అని మొదట్లో భ్రమ పడకపోయి ఉంటే, బహుశా హంతకుడు దొరికేవాడేమో! కానీ.. వాళ్లు చేసిన తప్పు కారణంగా హంతకుడు ఇంతవరకు దొరకలేదు. అసలు అతనెవరో కూడా తెలియకుండా మిస్టరీగా మిగిలిపోయింది. ఇది హత్య అని తేలినప్పటి నుంచి.. హంతకుడ్ని పట్టుకోవడం కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఐదేళ్లైనా.. అతడ్ని పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారు.

Pawan Kalyan: వారాహిని టచ్ చేస్తే.. నేనేంటో చూపిస్తా

ఈ నేపథ్యంలోనే మృతుల కుటుంబ సభ్యులు.. హంతకుడ్ని పట్టిస్తే, రూ. 300 కోట్ల నజరానా ఇస్తామని ప్రకటించారు. తమ తల్లిదండ్రుల హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడం, తమని ఆవేధనకు గురి చేస్తోందని కుమారుడు జోనాథన్ షెర్మాన్, కుమార్తె అలెక్స్ క్రావ్జిక్ కన్నీటి పర్యంతమవుతున్నారు. సాధ్యమైనంతవరకు ఈ కేసుని చేధించి, నిందితుడ్ని పట్టుకోవాలని వారు పోలీసుల్ని కోరారు. కాగా.. పోలీసులు ఈ కేసుకు సంబంధించి కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది అనుమానితుల్ని విచారించినా, ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు.. ఆ దంపతులు చనిపోయేటప్పటికీ వారి ఆస్తుల విలువ రూ. 20 వేల కోట్ల డాలర్లని ఫోర్బ్స్ అంచనా వేసింది. రూ. 400 కోట్ల డబ్బును వారు దాతృత్వ సేవలకు వినియోగించినట్టు తెలిసింది.

Ambati Rambabu: మేము కాదు గాడిదలం.. నువ్వే అడ్డగాడిదవి.. పవన్ పై అంబటి ఫైర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Barry Sherman
  • Barry Sherman Wife Honey
  • Billionaire Couple Death Mystery
  • Canadian Billionaire Couple
  • Jonathon Sherman

తాజావార్తలు

  • Iran: “మానవ కవచాలు”గా మారండి.. సొంత ప్రజలకు ఇరాన్ పిలుపు..

  • Geetha Singh:అవకాశం ఇస్తామని చెప్పి అనిల్ రావిపూడి టీమ్ నన్ను మోసం చేసింది.. నటి ఎమోషనల్ కామెంట్స్!

  • Amaravati Capital Development: అమరావతికి చట్టబద్ధత.. ప్రభుత్వంపై మరింత ఒత్తిడి..!

  • Abhishek banerjee: మేము అధికారంలోకి వస్తే, వారి ఇళ్లలోకి వెళ్లి చంపేస్తాం..

  • JR NTR : కొరటాల సిద్ధం.. కానీ అంతా ఎన్టీఆర్ చేతుల్లోనే!

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions