Canada: కెనడా స్కూల్‌లో ఘోరం.. విచక్షణారహితంగా కాల్పులు.. 10 మంది మృతి

  • కెనడా స్కూల్‌లో ఘోరం
  • విచక్షణారహితంగా కాల్పులు
  • 10 మంది మృతి.. నిందితుడు ఆత్మహత్య
Firing

Firing

కెనడాలో ఘోరం జరిగింది. బ్రిటిష్ కొలంబియాలోని పీస్ ప్రాంతంలోని టంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇప్పటి వరకు 10 మంది చనిపోయారు. 25 మందికి గాయాలయ్యాయి. నిందితుడు కూడా తనకు తాను కాల్చుకుని చనిపోయాడు.

ఇది కూడా చదవండి: Somalia Video: సోమాలియాలో తప్పిన విమాన ప్రమాదం.. సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

మంగళవారం మధ్యాహ్నం గోధుమ రంగు జుట్టు కలిగిన వ్యక్తి పాఠశాలలోకి ప్రవేశించి కాల్పులకు పాల్పడ్డాడు. ఘటనాస్థలిలో 8 మంది చనిపోగా.. సమీపంలోని ఇంటి దగ్గర మరో ఇద్దరు చనిపోయారు. మొత్తంగా 10 మంది చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!

సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లుగా చెప్పారు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని.. వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 1:20 గంటల సమయంలో జరిగినట్లుగా వెల్లడించారు.