NTV Telugu Site icon

ఖైదీల‌పై మ‌హిళా అధికారి లైంగిక వేధింపులు…జైలు శిక్ష‌…

తప్పు చేసి జైలుకు వెళ్లిన ఖైదీల ప్ర‌వ‌ర్త‌న‌, ఆలోచనా విధానంలో మార్పులు తీసుకొచ్చి వారిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత జైలు అధికారులపై ఉంటుంది.  అయితే, ఓ జైలు అధికారిణి అందుకు విరుద్ధంగా ప్రవర్తించింది.  ఖైదీల ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పులు తీసుకురావ‌డానికి బదులుగా, వారిని రెచ్చగొట్టి శృంగారానికి ప్రేరేపించింది.  నచ్చిన ఖైదీలతో నచ్చిన విధంగా శృంగారం చేస్తూ తన కామ‌వాంఛ‌లు తీర్చుకుంది. కాలిఫోర్నియాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో 26 ఏళ్ల మహిళా అధికారిణి టీనా గోంజాలెజ్ కు న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్షను విధించింది.  జైలులోని ఖైదీలకు సెల్‌ఫోన్లు, బ్లేడులు స‌ర‌ఫ‌రా చేసేద‌ని, సోదాలు జరిగే సమయంలో ఖైదీలను ముందస్తుగా హెచ్చ‌రించేద‌ని జైలు అధికారులు పేర్కొన్నారు.  2016 నుంచి గోంజాలెజ్ ప్రెస్నో కౌంటీ జైల్లో పనిచేస్తున్నారు.