Site icon NTV Telugu

మెక్సికోలో ఘోర‌రోడ్డు ప్ర‌మాదంః 12 మంది మృతి…

మెక్సికో దేశంలో జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది.  ఈ ప్ర‌మాదంలో 12 మంది మృతి చెందారు.  ఈశాన్య మెక్సికోలోని త‌మౌలీపాస్ రాష్ట్రంలో బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగింది.  రేనోసా-న్యూవోలియోన్ మోంటెర్రే మ‌ధ్య బ‌స్సు ప్ర‌యాణం చేస్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  బ‌స్సు వేగంగా ప్ర‌యాణం చేస్తుండ‌టంతో అదుపు త‌ప్పి బోల్తా కొట్టింది.  డ్రైవ‌ర్ బ‌స్సుపై నియంత్ర‌ణ కోల్పోవ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.  ప్ర‌మాదంలో అక్క‌డిక‌క్క‌డే 9 మంది మృతి చెంద‌గా, మ‌రో ముగ్గురు ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా మృతి చెందారు.  మ‌రో 10 మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  మ‌ర‌ణాల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.  

Exit mobile version